PK Movie Sequel: ‘పీకే’ సీక్వెల్‌పై స్పందించిన నిర్మాత.. ఈసారి గ్రహాంతరాసిగా కనిపించేది ఎవరో తెలుసా.?
Producer Confirms About PK Sequel: బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'పీకే' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో విడుదలైన ఈ సినిమా...
Producer Confirms About PK Sequel: బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘పీకే’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఓవైపు కామెడీని పండిస్తూనే మరోవైపు మత విశ్వాసాలు లాంటి సీరియస్ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు అభిజీత్. ఇక అమీర్ ఖాన్ వేరే గ్రహం నుంచి భూమిపైకి వచ్చిన ఒక ఏలియన్ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. ఇక ఈ సినిమా పూర్తి అయ్యే సమయంలో హీరో రణ్‌బీర్ కపూర్ పరిచయంతో కథ ముగుస్తుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో పలుసార్లు వార్తలు కూడా వచ్చాయి కానీ తర్వాత అవన్నీ పకార్లేనని తేలింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని చిత్ర నిర్మాత కన్ఫామ్ చేశాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న పీకే నిర్మాత వినోద్ చోప్రా ఈ సినిమా సీక్వెల్‌పై స్పందించాడు. పీకేకు సీక్వెల్ తీస్తున్నామని చెప్పిన వినోద్.. సినిమా చివరిలో రణబీర్‌ను చూపించం. కాబట్టి ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ ఉంది. కానీ అభిజీత్ మాత్రం సీక్వెల్‌కు కథను రాయలేదు. ఆయన కథ రాసిన వెంటనే సినిమాను మొదలు పెడతాం అని చెప్పుకొచ్చాడు. మరి అమీర్ ఖాన్ తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ‘పీకే’ పాత్రలో రణబీర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.