Prabhas-Nag Ashwin: నాగ్ అశ్విన్ సినిమాకు ప్రభాస్ ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చాడంటే.! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Prabhas-Nag Ashwin Film: పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్లో దూసుకుపోతున్న ప్రభాస్‌ డేట్స్‌ను 2 సంవత్సరాల పాటు బుక్ చేసుకున్నట్లు..

Prabhas-Nag Ashwin: నాగ్ అశ్విన్ సినిమాకు ప్రభాస్ ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చాడంటే.! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 22, 2021 | 6:18 AM

Prabhas-Nag Ashwin Film: పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్లో దూసుకుపోతున్న ప్రభాస్‌ డేట్స్‌ను 2 సంవత్సరాల పాటు బుక్ చేసుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపాడు. వీరిద్దరి కలయికలో ఓ ప్యాన్ ఇండియన్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకోసమే రీసెంట్‌గా ఈ డైరెక్టర్‌ జెమ్నాస్టిక్స్‌ వచ్చిన కొంతమంది ఫ్రెష్‌ ఫేస్‌లని సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ప్రభాస్‌ కూడా నాగ్ అశ్విన్‌ మూవీని తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. అందుకే ఎక్కవ డేట్లన్నీ ఈ సినిమాకే కేటాయించాడట. అయితే మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సెట్లో అగ్ని ప్రమాదం జరగడం.. తిరిగి ఈ సెట్‌ను ఇప్పుడప్పుడే వేయని పరిస్థితి ఏర్పడడంతో.. డేట్లు వృథా అవుతాయని.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకి ఆ డేట్లు కేటాయించాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనా.. ఈ సినిమాకు ప్రభాస్‌ భారీగా డేట్లు కేటాయించడం గురించి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు.