Krithi Shetty: ఒకే ఒక్క సినిమాలో నటించి.. మూడు భారీ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్న యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా..
Krithishetty: ఒకే ఒక్క సినిమాతో కుర్రకారుని వలపు ఉప్పెనలో ముంచెత్తుతోంది కన్నడ చిన్నది కృతిశెట్టి. చూడగానే మంత్రముగ్ధుల్ని చేసే రూపలావణ్యం, నాజూకు
Krithi Shetty: ఒకే ఒక్క సినిమాతో కుర్రకారుని వలపు ఉప్పెనలో ముంచెత్తుతోంది కన్నడ చిన్నది కృతిశెట్టి. చూడగానే మంత్రముగ్ధుల్ని చేసే రూపలావణ్యం, నాజూకు అందాలు కలబోసిన చక్కటి అభినయంతో ఈ తుళు సుందరి యువతరం కలలరాణిగా మారింది. ‘ఉప్పెన’తో నాయికగా అరంగ్రేటం చేసిన కృతిశెట్టికి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్న ఈ భామ, సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా కథానాయికగా ఖరారైంది.
తాజాగా ఈ సుకుమారి తెలుగులో మరో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇందులో కృతిశెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో వరుసగా మూడు భారీ చిత్రాల అవకాశాల్ని సొంతం చేసుకొని కృతిశెట్టి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. యువతరంలో తెచ్చుకున్న ఫాలోయింగే వరుస ఆఫర్లకు కారణమని చెబుతున్నారు. తెలుగులో మరో బడా హీరోయిన్‌గా కృతిశెట్టి కెరీర్‌లో దూసుకుపోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య