Lucifer Remake: నయన్ ప్లేస్‌లోకి మరో హీరోయిన్.. ఆ టాప్ హీరో సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన ‘పౌర్ణమి’..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ గురించి చాలా రోజులు కొన్ని వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై చిత్రయూనిట్ స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఇందులో చిరు సరసన లేడీ బాస్ నయనతార నటించనున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
చిరంజీవి… మోహన్ రాజా కాంబోలో రాబోతున్న లూసీఫర్ రీమేక్‌లో హీరోయిన్ గా నయన్ నటించాల్సి ఉందట. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నయన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నయన్ ప్లేస్‌లోకి మరో సీనియర్ హీరోయిన్ను ఎంపిక చేసినట్లుగా టాక్. ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో లీడ్ రోల్ చేయాల్సిన త్రిష అనూహ్యంగా ఆ మూవీ నుంచి తప్పుకుంది. తాజాగా చిరు తదుపరి సినిమా లూసీఫర్ స్టోరీ నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. మరీ ఈ సినిమాలోని హీరోయిన్ గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: