Happy Birthday Director Teja : చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు

సినిమాలపై అభిలాషతో చిత్రం తో అడుగు పెట్టి.. ఫ్యామిలీ సక్సెస్ తో కుటుంబ సభ్యులను నవ్వుల కితకితలు పెట్టించి... నువ్వు నేను అంటూ యువతను ఉర్రుతలూగించి.. ఎవరు ఔనన్నా కాదన్నా ముక్కు సూటిగా నిజం మాట్లాడుతూ..

Happy Birthday Director Teja : చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తేజ పుట్టిన రోజు నేడు
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2021 | 11:15 AM

Happy Birthday Director Teja : టాలీవుడ్ లో తనకంటూ ఓ ఫేమ్ ను సృష్టించుకున్న దర్శకుడు తేజ.. డైరెక్టర్ గా అరంగ్రేటం చేసిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించాడు. సినిమాలపై అభిలాషతో చిత్రం తో అడుగు పెట్టి.. ఫ్యామిలీ సక్సెస్ తో కుటుంబ సభ్యులను నవ్వుల కితకితలు పెట్టించి… నువ్వు నేను అంటూ యువతను ఉర్రుతలూగించి.. ఎవరు ఔనన్నా కాదన్నా ముక్కు సూటిగా నిజం మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం తేజ స్పెషాలిటీ. ఆయన పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా తేజ జర్నీని తెలుసుకుందాం..!

ధర్మ తేజ 1966 ఫిబ్రవరి 22వ తేదీన మద్రాస్ లో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తేజ ఈ రోజు ఈ స్టేజ్ కు చేరుకోవడం వెనుక అంతులేని వ్యధ.. కష్టాలున్నాయి. సినీ పరిశ్రమలో మొదట లైటింగ్ అండ్ సౌండ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన తేజ తర్వాత కెమెరా మెన్ గా ఆ డిపార్ట్ మెంట్ లో అడుగు పెట్టాడు.. కెమెరా మేన గా తెలుగు, హిందూ లోని పలు సినిమాలకు చేశాడు. అలాంటి సినీ జర్నీలో రామ్ గోపాల్ వార్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. శివ సినిమా సమయంలో ఆ సినిమా పోస్టర్ లోగోను రూపొందించి వర్మ అభిమానాన్ని సంపాదించాడు. తర్వాత రాత్ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారాడు.

కెమెరా మెన్ నుంచి దర్శకుడు గా చిత్రం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. తక్కువ బడ్జెట్ తో ఉదయ్ కుమార్, రీమాసేన్ , చిత్రం శీను వంటి అనేక కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. జగపతిబాబు రోజా హీరో హీరాయిన్లు గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ సర్కస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే నువ్వు నేను సినిమా తో యూత్ లో ఓట్రెండ్ సెట్ చేశాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నంది అవార్డుల పంటను పండించింది.

జయం సినిమాతో నితిన్, సదాలను వెండి తెరకు హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశాడు.. తేజ కు మరింత మంచి పేరు తెచ్చింది. మహేష్ బాబు ను డిఫరెంట్ కోణంలో చూపిస్తూ నిజం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మహేష్ బాబు ఈ సినిమా మరో నందిని తెచ్చిపెట్టింది.

నెక్స్ట్ తేజ తెరకెక్కించిన జై, దైర్యం, ఔనన్నా కాదన్నా, లక్ష్మి కళ్యాణం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకోలేక పోయాయి. కేక,1000 అబద్దాలు, నీకు నాకు డాష్..డాష్,హోరా హోరి చిత్రాలు డిజాస్టర్లు గా నిలిచాయి. 2017లో రానాతో తెరకెక్కించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మరోసారి సంచలనం రేపాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది.

అయితే తేజ వెండి తెరకు పరిచయం చేసిన నటీనటులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. నితిన్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులు కూడా ఉన్నారు. ఇటీవల బెల్లం కొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరాయిన్లు గా సీత సినిమా తో ప్రేక్షకుల పలకరించాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా జీవితంలో కింద స్థాయి నుంచి పైకి ఎదిగిన తేజ జీవితం అందరికి స్ఫూర్తి ఈరోజు తేజ పుట్టిన రోజు శుభాకంక్షాలను తెలియజేస్తూ.. ఇండస్ట్రీలో మరిన్ని మంచి సినిమాలను తెరకెక్కించి మంచి దర్శకుడుగా పేరు సంపాదించుకోవాలని కొట్టుకుంటున్నాము

Also Read:

 శీతల ప్రాంతాల్లోని సరిహద్దుల వద్ద సైనికుల కోసం స్పెషల్ టెంట్.. ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!