బెల్లంకొండతో పాయల్ మాస్ డ్యాన్స్..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా అంటే చాలు..ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ సాదా సీదా హీరోయిన్స్ కాదు..ఏకంగా టాలీవుడ్‌ను ఏలుతున్న అందాల తారలతో మాస్ డ్యాన్స్ చేస్తాడు బెల్లంకొండ. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ జానకి నాయక’లో కేథరిన్‌లతో ఈ హీరో స్టెప్పులు వేశాడు. ‘సాక్ష్యం’, ‘కవచం’ సినిమాల్లో ఐటమ్ సాంగులకు బ్రేక్ ఇచ్చిన శ్రీనివాస్.. కాస్త విరామం తరువాత మళ్లీ ‘సీత’లో ఐటం సాంగ్‌తో రచ్చ చేయబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, […]

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా అంటే చాలు..ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ సాదా సీదా హీరోయిన్స్ కాదు..ఏకంగా టాలీవుడ్‌ను ఏలుతున్న అందాల తారలతో మాస్ డ్యాన్స్ చేస్తాడు బెల్లంకొండ. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ జానకి నాయక’లో కేథరిన్‌లతో ఈ హీరో స్టెప్పులు వేశాడు. ‘సాక్ష్యం’, ‘కవచం’ సినిమాల్లో ఐటమ్ సాంగులకు బ్రేక్ ఇచ్చిన శ్రీనివాస్.. కాస్త విరామం తరువాత మళ్లీ ‘సీత’లో ఐటం సాంగ్‌తో రచ్చ చేయబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీత’. బెల్లంకొండ, కాజల్ జోడీ రెండోసారి నటిస్తున్న సినిమా ఇది. ఇందులో మన్నారా చోప్రా రెండో కథానాయికగా నటిస్తుంది. అలాగే ప్రత్యేక గీతంలో పాయల్ రాజ్‌పుత్ సందడి చేయనుంది. ‘బుల్‌రెడ్డి..’ అని సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
‘ఆర్ఎక్స్ 100’ సినిమా టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన పాయల్ రాజ్ పుత్ కు అవకాశాలు వచ్చినా ఆచితూచి అడుగులు వేయడం నేర్చుకుంది. ఏ సినిమా చేస్తే ఎలాంటి విజయం వస్తుందో అని అలోచించి మూవీస్ సెలక్ట్ చేసుకుంటోంది పాయల్.
‘ఎఫ్ 2’ తరువాత వెంకటేష్ చేస్తున్న వెంకిమామ సినిమాలో పాయల్ నటిస్తుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సీత సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించేందుకు ఒకే చెప్పింది. ఈ సాంగ్ షూటింగ్ కు సంబంధించిన ఓ స్టిల్‌ను రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. జిగేల్ అనిపించే డ్రెస్ లో ఆర్ఎక్స్ 100 బైక్ పై వస్తున్న ఆమె ఫొటో యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.