Pawan Kalyan: ఓజీకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ ఎన్నో తెలుసా.? రెమ్యునరేషన్ రోజుకు అన్ని కోట్లా.!
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను 'ఓజీ' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు..

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను ‘ఓజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. ఇందులో భాగంగానే ఓజీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 35 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రేక్ లెస్ షూటింగ్‌తో మరో 20 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్స్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే ఓజీ సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. పవన్‌కు ఈ సినిమా కోసం ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ లెక్కన పవన్ కళ్యాణ్ రోజుకి ఏకంగా రూ. 2 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్ని సమాచారం. సాహో తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో కావడంతో ఓజీపై అందరి దృష్టిపడింది. సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం మెస్మరైజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పవన్ మూవీ విషయంలో సుజీత్ చాలా నమ్మకంతో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఇన్ని అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఓజీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




