AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Roti Trick: చిన్న గిన్నెతో చపాతీ పిండి ముద్దలు రెడీ! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఐడియా!

వంట చేయడం అంటే ఒక పెద్ద యుద్ధమే. ముఖ్యంగా చపాతీలు చేసేటప్పుడు పిండి కలపడం ఒక ఎత్తు అయితే.. ఆ పిండిని సమాన భాగాలుగా చేసి, గుండ్రటి ముద్దలుగా చేయడం మరో ఎత్తు. కొత్తగా వంట నేర్చుకునే వారికి లేదా బ్యాచిలర్లకు ఇది ఒక పెద్ద తలనొప్పి లాంటి వ్యవహారం.

Viral Roti Trick: చిన్న గిన్నెతో చపాతీ పిండి ముద్దలు రెడీ! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఐడియా!
Chapathi
Nikhil
|

Updated on: Jan 24, 2026 | 9:00 AM

Share

ఆ ముద్దలు సరిగ్గా రాక చపాతీలు ఒక్కోటి ఒక్కో ఆకారంలో వస్తుంటాయి. అయితే తాజాగా ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వంటగదిలో కష్టపడే ప్రతి ఒక్కరికీ పనిని సులభతరం చేసే ఒక అద్భుతమైన ఐడియాను అతను కనిపెట్టాడు. ఎటువంటి కష్టం లేకుండా, కేవలం ఇంట్లో ఉండే ఒక చిన్న గిన్నెతో చపాతీ ముద్దలను నిమిషాల వ్యవధిలో ఎలా సిద్ధం చేయాలో చేసి చూపించాడు. ఈ వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటి? ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న స్మార్ట్ ఐడియా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రీల్ లో ఒక అబ్బాయి వంటగదిలో చపాతీలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. సాధారణంగా పిండిని చేతులతో కలిపి చిన్న చిన్న ముక్కలుగా కోసి ముద్దలు చేస్తాం. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక చిన్న స్టీల్ గిన్నెను పరికరంగా మార్చుకున్నాడు. పళ్ళెంలో కలిపి ఉన్న పిండి ముద్దపై ఆ చిన్న గిన్నెను బోర్లించి, గుండ్రంగా తిప్పడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటంటే, కేవలం కొన్ని సెకన్ల పాటు గిన్నెను అలా తిప్పగానే లోపల ఉన్న పిండి అద్భుతమైన ఆకారంలో, గుండ్రని ముద్దగా మారిపోయింది. Maximummanthan అనే ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో షేర్​ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఈ అకౌంట్​కి 1.8 మిలియన్​ ఫాలోవర్స్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న విషయం.​

మిలియన్ల కొద్దీ వ్యూస్ – లక్షల్లో లైక్స్..

ఈ సింపుల్ టెక్నిక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. “ఇన్ని రోజులు ఈ ఐడియా మనకు ఎందుకు రాలేదు?” అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్లలో వ్యూస్ మరియు లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఈ పద్ధతి ద్వారా పిండి ముద్దలు చేయడానికి పట్టే సమయం సగానికి పైగా తగ్గుతుంది. చేతులతో చేసే దానికంటే గిన్నెతో చేసిన ముద్దలు ఎంతో ఫినిషింగ్‌తో, ఒకే పరిమాణంలో వస్తున్నాయి. పిండి చేతులకు అంటుకోకుండా, చాలా నీట్‌గా పని పూర్తవుతుంది.

మన దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచనలకు కొదవ లేదు. తక్కువ ఖర్చుతో లేదా ఇంట్లో ఉండే వస్తువులతో పనులను సులభం చేసుకోవడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ యువకుడు కనిపెట్టిన ఈ గిన్నె ట్రిక్ కూడా అలాంటిదే. ముఖ్యంగా హాస్టల్ లో ఉండే విద్యార్థులకు, ఒంటరిగా ఉంటూ వంట చేసుకునే పురుషులకు ఇది ఒక గొప్ప ఆవిష్కరణలా అనిపిస్తోంది. కష్టపడి పని చేయడం కంటే ఇష్టపడి, తెలివిగా పని చేయడమే ఉత్తమమని ఈ వీడియో నిరూపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

గృహిణుల కష్టాలను తీర్చే వినూత్న ఐడియా! ఈ ట్రిక్ చూస్తే ఫిదా
గృహిణుల కష్టాలను తీర్చే వినూత్న ఐడియా! ఈ ట్రిక్ చూస్తే ఫిదా
‘చికిరి చికిరి’ తర్వాత మరో సెన్సేషన్.. బాక్సాఫీస్ వద్ద పూనకాలే!
‘చికిరి చికిరి’ తర్వాత మరో సెన్సేషన్.. బాక్సాఫీస్ వద్ద పూనకాలే!
తెలుగు రాష్ట్రంలోనే ఓ వింత ఆలయం.. గుమ్మడికాయలే నైవేద్యం..
తెలుగు రాష్ట్రంలోనే ఓ వింత ఆలయం.. గుమ్మడికాయలే నైవేద్యం..
ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..
ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి..
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి..
76 పరుగులతో ఇషాన్ ఊచకోత..అయినా కెప్టెన్ సూర్యకు ఎందుకు కోపం ?
76 పరుగులతో ఇషాన్ ఊచకోత..అయినా కెప్టెన్ సూర్యకు ఎందుకు కోపం ?
ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక..
ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్ బారిన పడినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్ బారిన పడినట్లే..
మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు..
మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు..
ఇళ్లా..? ఇంద్రభవనమా.. ? కీర్తి సురేష్ ఇంటిని చూస్తే..
ఇళ్లా..? ఇంద్రభవనమా.. ? కీర్తి సురేష్ ఇంటిని చూస్తే..