AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Artist : హలో సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా.. ? ఇప్పుడేలా మారిందో చూస్తే ఫిదా అయిపోతారు..

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చిన్నారి లేటేస్ట్ లుక్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోస్, వీడియోలతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Child Artist : హలో సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా.. ? ఇప్పుడేలా మారిందో చూస్తే ఫిదా అయిపోతారు..
Akhil Movie Child Artist
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2026 | 8:52 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి గుర్తుందా.. ? అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాలో చైల్ట్ ఆర్టిస్టుగా కనిపించింది. ఈ మూవీలో జున్ను పాత్రలో నటించి అందరిని మెప్పించింది. అఖిల్ హీరోగా వచ్చిన రెండవ సినిమా ఇది. 2017సో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా క్లాసిక్ సినీప్రియుల హృదయాలను గెలుచుకుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

హలో సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో, నటనతో ఆకట్టుకుంది ఓ చిన్నారి. ఇందులో జున్ను పాత్రలో కనిపించింది. ఆ సినిమా విడుదలై దాదాపు 9 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జున్ను ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. ఆ చిన్నారి పేరు మైరా దండేకర్ అని తెలుస్తోంది. అప్పట్లో క్యూట్ క్యూట్ మాటలతో కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు డ్యాన్స్ వీడియోలతో ఫేమస్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

అలాగే ఇటీవల ఓ నెటిజన్ ఈ చిన్నారి లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయగా.. ఏంటీ జున్ను ఇంతగా మారిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నిత్యం ఇన్ స్టాలో డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..