AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: మెగా పవర్‌స్టార్ సినిమాలో స్టార్​ హీరోయిన్​ స్పెషల్ సాంగ్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకే ఒక సినిమా పేరు విపరీతంగా మార్మోగిపోతోంది.. అదే 'పెద్ది'. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా వారసుడు రామ్​ చరణ్​, ఒక సెన్సేషనల్ డైరెక్టర్‌తో జతకట్టి చేస్తున్న ఈ భారీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Peddi: మెగా పవర్‌స్టార్ సినిమాలో స్టార్​ హీరోయిన్​ స్పెషల్ సాంగ్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరిపోయిందిగా!
Ramcharan N Star Heroine
Nikhil
|

Updated on: Jan 24, 2026 | 9:00 AM

Share

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఆడియో శాంపిల్స్ నెట్టింట ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ‘చికిరి చికిరి’ పాట తెచ్చిన వైబ్స్ ఇంకా తగ్గకముందే, ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక ఊరమాస్ స్పెషల్ సాంగ్ ఉందని, అందులో ఆడిపాడటానికి ఒక స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో సంప్రదాయబద్ధమైన పాత్రలతో అందరి మనసు గెలుచుకున్న ఆ ‘సీత’, ఇప్పుడు మెగా హీరోతో కలిసి మాస్ స్టెప్పులు వేయడానికి సిద్ధమైందట. ఇంతకీ ఆ భామ ఎవరు? చరణ్ సినిమాలో ఆమె పాత్ర ఏంటి?

బుచ్చిబాబు మ్యాజిక్..

‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Mrunal N Charan

Mrunal N Charan

మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్​..

సాధారణంగా స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడానికి మొగ్గు చూపడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్‌గా మారింది. కాజల్ అగర్వాల్ నుండి శ్రీలీల వరకు అందరూ స్టార్ హీరోల సినిమాల్లో ఆడిపాడిన వారే. ఇప్పుడు ఆ జాబితాలో మృణాల్ ఠాకూర్ కూడా చేరబోతున్నట్లు సమాచారం. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తాను ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది. అది ‘పెద్ది’ కోసమే అయి ఉంటుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

ఒకవైపు రామ్ చరణ్ అదిరిపోయే గ్రేస్, మరోవైపు మృణాల్ ఠాకూర్ అందం తోడైతే థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం. ఏఆర్ రెహమాన్ అందించే మాస్ ట్యూన్ కు మృణాల్ గ్లామర్ అదనపు బలాన్ని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. మెగా అభిమానులు కూడా “మృణాల్‌తో స్పెషల్ సాంగ్ చేయించు బుచ్చి.. రచ్చ మామూలుగా ఉండదు” అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ‘పెద్ది’ క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయం.

రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల సినిమా వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సమ్మర్ బరిలో దింపాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

గృహిణుల కష్టాలను తీర్చే వినూత్న ఐడియా! ఈ ట్రిక్ చూస్తే ఫిదా
గృహిణుల కష్టాలను తీర్చే వినూత్న ఐడియా! ఈ ట్రిక్ చూస్తే ఫిదా
‘చికిరి చికిరి’ తర్వాత మరో సెన్సేషన్.. బాక్సాఫీస్ వద్ద పూనకాలే!
‘చికిరి చికిరి’ తర్వాత మరో సెన్సేషన్.. బాక్సాఫీస్ వద్ద పూనకాలే!
తెలుగు రాష్ట్రంలోనే ఓ వింత ఆలయం.. గుమ్మడికాయలే నైవేద్యం..
తెలుగు రాష్ట్రంలోనే ఓ వింత ఆలయం.. గుమ్మడికాయలే నైవేద్యం..
ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..
ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందంటే..
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి..
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి..
76 పరుగులతో ఇషాన్ ఊచకోత..అయినా కెప్టెన్ సూర్యకు ఎందుకు కోపం ?
76 పరుగులతో ఇషాన్ ఊచకోత..అయినా కెప్టెన్ సూర్యకు ఎందుకు కోపం ?
ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక..
ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్ బారిన పడినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్ బారిన పడినట్లే..
మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు..
మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు..
ఇళ్లా..? ఇంద్రభవనమా.. ? కీర్తి సురేష్ ఇంటిని చూస్తే..
ఇళ్లా..? ఇంద్రభవనమా.. ? కీర్తి సురేష్ ఇంటిని చూస్తే..