బెండకాయ కోడిగుడ్డు ఫ్రై.. ఇలా వండి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే! 

Prasanna Yadla

23 January 2026

Pic credit - Pixabay

ఇక మన దేశంలో బెండకాయ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బెండకాయతో ఇగురు నుంచి ఫ్రై వరకు అందరూ తింటారు. ఎందుకంటే, దీనిలో అన్ని పోషకాలు ఉంటాయి. అంతే కాదు, ఇది సులభంగా జీర్ణమవుతుంది.

బెండకాయ కోడిగుడ్డు ఫ్రై

బెండకాయ  కోడిగుడ్డు ఫ్రై ఎప్పుడైనా విన్నారా? వినడానికి కొత్తగా ఉంటుంది కానీ, కర్రీ చేసుకుని తింటే ఆ రుచికర భోజనం ఇంకెక్కడా కూడా దొరకదు

రుచికర భోజనం

పోషకాలు ఎక్కువగా గుడ్డుతో కలిపి ఉండి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులో  ఫోలేట్, విటమిన్ A, D, E, B12 ఉంటాయి. మరి,  ఇంకెందుకు లేట్ ఇక్కడ చూసేద్దాం.. 

పోషకాలు 

ముందు పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక దానిలో   కరివేపాకు, ఆవాలు వేసి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి

స్టెప్ - 1

ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత  బెండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత లేకుండా జిగురు పోయే వరకు వేయించాలి. 

స్టెప్ - 2

బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత కోడిగుడ్లను బ్రేక్ చేసి దానిలో  వేయాలి.  అది కూర లాగా అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి బాగా వేయించాలి. 

స్టెప్ - 3

ఇక చివర్లో  కారం, రుచికి తగినంత ఉప్పు వేసి 4 నిమిషాలు పాటు అలాగే స్టవ్ మంట మీద ఉంచి కిందకు దించేయాలి.

స్టెప్ - 4

అంతే వేడి వేడి బెండకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ. మరి, ఇంకెందుకు ఆలస్యం అన్నంతో కానీ, చపాతీ తో కానీ తింటే రుచి కరంగా ఉంటుంది.

బెండకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ!