Magadheera Movie: మగధీర సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?.. హిట్టు వదిలేసుకున్న బ్యూటీ ఎవరంటే..

ఇందులో యువరాణి మిత్రవింద పాత్రకు ముందుగా అనుకున్నది కాజల్‏ను కాదట. ఓ హీరోయిన్‏కు కథ చెప్పగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ హిట్ చిత్రాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ మూవీ ఛాన్స్ కాజల్ వద్దకు చేరింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా ?..

Magadheera Movie: మగధీర సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?.. హిట్టు వదిలేసుకున్న బ్యూటీ ఎవరంటే..
Magadheera
Follow us

|

Updated on: May 18, 2023 | 3:38 PM

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన దర్శకత్వంపై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో మగధీర ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ చందమామ కాజల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇందులో యువరాణి మిత్రవింద పాత్రకు ముందుగా అనుకున్నది కాజల్‏ను కాదట. ఓ హీరోయిన్‏కు కథ చెప్పగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ హిట్ చిత్రాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ మూవీ ఛాన్స్ కాజల్ వద్దకు చేరింది. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా ?.. తనే మిల్కీబ్యూటీ తమన్నా.

మగధీర సినిమాలో యువరాణి మిత్రవింద అత్యంత అందమైన అమ్మాయి.. గొప్ప ప్రేమికురాలు కూడా. ఈ పాత్రలో నటించడానికి డైరెక్టర్ రాజమౌళి యూనిట్ సభ్యులు ముందుగా కథానాయికగా హీరోయిన్ తమన్నాను అనుకున్నారట. దీంతో ముంబైలో ఆమెను సంప్రదించగా.. మగధీర చిత్ర కథను విన్న తమన్నా సైతం ఓకే చెప్పిందట. అయితే అదే సమయంలో హిందీలో హీరోయిన్‏తో కరీనా కపూర్‏తో కలిసి ఒక చిత్రం చేస్తుండడంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదట.

ఇక మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తుండగా.. అప్పటికే చందమామ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ ను సెలక్ట్ చేశారట. ఈ సినిమాతో కాజల్ క్రేజ్ మారిపోయింది. అయితే ఫస్ట్ మూవీ మిస్సైన బాహుబలితో జక్కన్న సినిమాలో నటించే కల నెరవేర్చుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.