AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : సీరియల్లో విలనిజం.. నెట్టింట గ్లామర్ అరాచకం.. ఫోజులతో గత్తరలేపుతున్న లేడీ విలన్..

తెలుగులో హిట్ సీరియల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈమధ్యకాలంలో సీరియల్స్ కు కొనసాగింపు ట్రెండ్ సైతం నడుస్తుంది. అయితే ఇప్పుడు సీరియల్ బ్యూటీలకు హీరోయిన్లకు మించి ఫాలోయింగ్ వస్తుంది. తాజాగా ఓ అమ్మడు లేటేస్ట్ గ్లామర్ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Serial Actress : సీరియల్లో విలనిజం.. నెట్టింట గ్లామర్ అరాచకం.. ఫోజులతో గత్తరలేపుతున్న లేడీ విలన్..
Gayathri
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2026 | 9:31 AM

Share

ప్రస్తుతం సీరియల్ తారలకు హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం తమ నటనతో కట్టిపడేస్తున్నారు. అలాగే ఇప్పుడు సీరియల్ విలన్ పాత్రలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. హీరోయిన్లకు మించి ఫిట్నెస్, లుక్స్ ఉన్నప్పటికీ బుల్లితెరపై నెగిటివ్ షేడ్స్ పాత్రలతో మెప్పిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్ తో అలరిస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఓ హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? ఆమె హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కట్ చేస్తే..సీరియల్లో విలనిజం పండిస్తుంది. ఆమె మరెవరో కాదండి.. జ్యోత్న్స.. అలియాస్ గాయత్రి సింహాద్రి. గుర్తుపట్టే ఉంటారు కదా..

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..

బుల్లితెరపై ఇప్పుడు దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం 2. గతంలో వచ్చిన కార్తీక దీపంకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు ఈ సీరియల్ కు రావడం విశేషం. ఇందులో కార్తీక్, దీప పాత్రలతోపాటు.. విలన్ పాత్రలో నటిస్తున్న జ్యోత్స్నకు సైతం అదే క్రేజ్ వస్తుంది. జ్యోత్స్న పాత్రలో విలనిజం పండించే అమ్మాయిగా తన నటనతో అదరగొట్టేస్తుంది గాయత్రి సింహాద్రి. సీరియల్లో ఆమె నటనకు అడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎంతగా అంటే.. జ్యోత్న్స పాత్రలో ఆమె చూపించే విలనిజం చూసి తిట్టుకునేంత. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోషూట్ లతో నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

గాయత్రి సింహాద్రి లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. అటు చీరకట్టులో అందంతో కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు బ్లూ కలర్ డ్రెస్ లో ఊహించని లుక్ లో కనిపించింది జ్యోత్న్స.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..