AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ రహస్యాలు తెలిస్తే ప్రపంచమే మీ వెనుక.. చాణక్యుడు ఈ సీక్రెట్స్ తెలుసా..?

భారతదేశం కన్న గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు. సామాన్య బాలుడైన చంద్రగుప్త మౌర్యుడిని అఖండ భారత చక్రవర్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి విజయానికి అవసరమైన అనేక రహస్యాలను వెల్లడించారు. వేల ఏళ్ల క్రితం ఆయన చెప్పిన సూత్రాలు నేటి ఆధునిక కాలానికి కూడా అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. ముఖ్యంగా ఈ కింది మూడు విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తిని ఓడించడం ఎవరితరం కాదని చాణక్యుడు తెలిపారు.

Krishna S
|

Updated on: Jan 24, 2026 | 11:04 AM

Share
చాణక్యుడి ప్రకారం.. ఏ వ్యక్తి అయితే తన లక్ష్యం పట్ల స్పష్టత కలిగి ఉంటాడో అతను సగం విజయం సాధించినట్లే. లక్ష్యం లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిది. తన దారిని తాను స్పష్టంగా ఎంచుకున్న వ్యక్తి ఎప్పుడూ పక్కదారి పట్టడు. అలాంటి వారు తమ సమయాన్ని, శక్తిని వృథా చేయకుండా కేవలం గమ్యం వైపుకే మళ్లిస్తారు. ఎవరైతే తన పని మీద సంపూర్ణ దృష్టిని పెడతారో, వారిని అజేయులుగా చాణక్యుడు అభివర్ణించారు.

1 / 5
మాటకు ఉన్న శక్తి మరే దానికి ఉండదు. అందుకే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అనే విచక్షణ చాలా అవసరమని చాణక్య నీతి చెబుతోంది. అనవసరమైన చోట మాట్లాడటం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. సరైన సమయంలో మాట్లాడే మాటలు సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిపెడతాయి. మౌనాన్ని ఆయుధంగా వాడటం తెలిసిన వ్యక్తిని ఎవరూ మానసికంగా దెబ్బతీయలేరు.

2 / 5
మనం విజయం సాధించాలంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వారో తెలియడం చాలా ముఖ్యం. నవ్వుతూ వెన్నుపోటు పొడిచే స్నేహితుల కంటే, నేరుగా దాడి చేసే శత్రువు మేలని చాణక్యుడు హెచ్చరించారు.
నిజమైన స్నేహితుడు ఎవరో, శత్రువు ఎవరో గుర్తించగలిగే జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పటికీ మోసపోడు.

మనం విజయం సాధించాలంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వారో తెలియడం చాలా ముఖ్యం. నవ్వుతూ వెన్నుపోటు పొడిచే స్నేహితుల కంటే, నేరుగా దాడి చేసే శత్రువు మేలని చాణక్యుడు హెచ్చరించారు. నిజమైన స్నేహితుడు ఎవరో, శత్రువు ఎవరో గుర్తించగలిగే జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పటికీ మోసపోడు.

3 / 5
దుష్ట స్వభావం కలవారిని దూరం పెట్టడం వల్ల అనవసరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు. మనుషుల మనస్తత్వాలను సరిగ్గా అంచనా వేయగలిగితే, ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవడం సులభం అవుతుంది.

4 / 5
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలనుకునే వారు ఆచార్య చాణక్యుడి ఈ మూడు సూత్రాలను ఆచరిస్తే వారు అజేయులుగా మారుతారని విశ్లేషకులు చెబుతుంటారు. క్రమశిక్షణ, వివేకం కలిసిన చోట విజయం దానంతట అదే వస్తుంది.

5 / 5