ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్ అవసరమే రాదు.. రోగాలకు చెక్ పెట్టె దివ్యౌషధం..
వామాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి. వామాకు ఆకులు దగ్గు, జలుబు, బ్రాంకైటిస్, జ్వరం వంటి అనేక సాధారణ ఆరోగ్య సమస్యలకు సహజ నివారణ. మూత్రపిండాల్లో రాళ్ళు, గుండె ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలిచ్చే తల్లులకు, పిల్లలకు కూడా ప్రయోజనకరమైనది. పొట్టనొప్పి, ఆకలి లేకపోవడం, గాయాలు, దద్దుర్లకు ఔషధంగా పనిచేస్తుంది.

వాము ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వాము ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా.. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను నియంత్రిస్తుంది.. అందుకే వీటిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పచ్చని, మందపాటి ఆకులతో కూడిన వాము మొక్కలను కిచెన్ గార్డెన్లలో సులభంగా పెంచుకోవచ్చు. దీని ఆకులు వాము గింజల వాసనను పోలి ఉంటాయి.. ఇవి ఎన్నో సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.. ఈ ఆకులను సాధారణంగా బజ్జీల తయారీకి ఉపయోగిస్తారు.. కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు విస్తృతంగా ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆకులను ఆరోగ్య సంరక్షణకు ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం:
దగ్గు, జలుబు, బ్రాంకైటిస్, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, 10 నుండి 12 వామాకు ఆకులను చిన్న ముక్కలుగా చేసి, నీటిలో వేసి, నాలుగో వంతు అయ్యే వరకు సిమ్ లో మరిగించి కషాయాన్ని తయారు చేయాలి. ఈ కషాయాన్ని తాగడం ద్వారా ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
మూత్రపిండాల ఆరోగ్యం – పిల్లల సంరక్షణ:
మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారికి వామాకు మంచిది. పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు, కొన్ని వామాకులను సైంధవ లవణంతో కలిపి నూరి, ఆ రసాన్ని నాకించినట్లయితే ఉపశమనం లభిస్తుంది. తల్లిపాలు తాగే పసిపిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు, వామాకు రసాన్ని కాస్త తేనెతో కలిపి తల్లి చనుమొనలకు రాస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.
పాలిచ్చే తల్లులకు – జీర్ణక్రియకు:
పాలిచ్చే తల్లులు ఒకటి లేదా రెండు వామాకు ఆకులను నేరుగా తినడం వల్ల పాలు పడటానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు. పొట్టనొప్పి ఉన్నా, ఆకలి లేకపోయినా, ఒంటిమీద దద్దుర్లు వచ్చినా ఈ ఆకులను తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. వామాకు, అల్లం కలిపి బాగా నూరి తీసిన రసం తాగితే ఆకలి పెరిగి అజీర్తి తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం – బరువు తగ్గింపు:
వామాకు గుండె ఆరోగ్యానికి మంచిదిగా పరిగణించబడుతుంది. ఈ ఆకులను సలాడ్లలో వేసుకొని తినడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న నీటిని తొలగించి, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది సహజమైన మూత్రవిసర్జన కారకంగా పనిచేసి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతుంది.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
కండ్ల కలకతో బాధపడేవారు వామాకు ముద్దను కళ్ళ చుట్టూ పెట్టుకుంటే మంచిది. తలనొప్పి ఉన్నప్పుడు ఆకులను నుదుటి మీద పెట్టుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. గాయాలు, పుండ్లు, దురదలకు కూడా వామాకు ఒక ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
కాబట్టి, మీ ఇంట్లో వాము మొక్కను పెంచుకోవడం ద్వారా పైన పేర్కొన్న అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వామాకు ఆకులను సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మంచిది.. లేకపోతే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించి తీసుకోవడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
