The Road OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిష లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ది రోడ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?
తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే త్రిష నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులోనూ ది రోడ్ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ది రోడ్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది

అందాల తార త్రిష నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రోడ్’.. రివెంజ్ ఇన్ 462 కిలో మీటర్స్ అనేది మూవీ క్యాప్షన్.అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే త్రిష నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులోనూ ది రోడ్ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ది రోడ్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా త్రిష సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (నవంబర్ 10) అర్ధరాత్రి నుంచి ది రోడ్ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. ది రోడ్ మూవీలో మలయాళ నటుడు షబీర్ ప్రధాన పాత్ర పోషించాడు. త్రిష స్నేహితురాలిగా మియా జార్జ్, కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ స్వరాలు సమకూర్చారు.
తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ది రోడ్ సినిమాను తెరకెక్కించారు. నేషనల్ హైవేలోని ఒక ప్రదేశంలో వరుసగా హత్యలు జరుగుతాయి. అసలు ఈ హత్యల వెనక మర్మమేమిటి? దాని వెనక ఉన్నది ఎవరు అనేది తెలుసుకోవడానికి త్రిష ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో త్రిషకు ఎలాంటి అనుభవాలు ఎలాంటి ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే ది రోడ్ సినిమాను చూడాల్సిందే. మరి థియేటర్లలో ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.
ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ది రోడ్..
Come on, let’s go!🛣️️🔥
Discover the mystery of ‘The Road’ with aha – your ticket to thrilling entertainment! 🍿
Now Streaming▶️ https://t.co/R3suGGl47t@trishtrashers @Actorsanthosh @actorshabeer @actorvivekpra @Arunvaseegaran1 @SamCSmusic @tipsmusicsouth @akash_tweetz pic.twitter.com/tCIaXBdQL2
— ahavideoin (@ahavideoIN) November 10, 2023
ది రోడ్ ట్రైలర్ చూశారా?
Prepare for the ultimate suspense ride..🛣️ Watch ‘The Road’ trailer now👉@trishtrashers #TheRoad @Actorsanthosh @actorshabeer @actorvivekpra @Arunvaseegaran1 @SamCSmusic @tipsmusicsouth @akash_tweetz pic.twitter.com/pmNDY26od3
— ahavideoin (@ahavideoIN) November 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








