Anweshippin Kandethum: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ టోవినో థామస్ మూవీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

డార్విన్‌ కురియకోస్‌ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం విశేషం. అంతేకాదు ఐఎండీబీ ఈ సినిమాకు ఏకంగా 8.4 రేటింగ్ ఇచ్చింది.

Anweshippin Kandethum: ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ టోవినో థామస్ మూవీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Anweshippin Kandethum Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2024 | 9:18 PM

2018 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు మలయాళ స్టార్ హీరో టొవినో థామస్. అంతకు ముందు ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి. ఇక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. టొవినో థామస్ నటించిన మరొక సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. అదే ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’. డార్విన్‌ కురియకోస్‌ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం విశేషం. అంతేకాదు ఐఎండీబీ ఈ సినిమాకు ఏకంగా 8.4 రేటింగ్ ఇచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న అన్వేషిప్పిన్ కండేతుమ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది నెట్‌ ఫ్లిక్స్.

ఇవి కూడా చదవండి

అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమాలో వినీత్ డేవిడ్, రాహుల్ రాజగోపాల్, సిద్దిఖీ, షమ్మి తిలకన్, సాదిఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో టొవినో థామస్ నిజాయతీగల ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్‌ నారాయణ పాత్రలో నటించాడు. రెండు హత్యకేసులను ఛేదించే బాధ్యత అతని మీద పడుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని ఆనంద్ తెలుసుకుంటాడు. అయితే వాటిని బయటపెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. నిందితుల గురించి తెలిసినా అరెస్ట్ చేయడు. మరి ఈ కథ ఎక్కడిదకా వెళ్లింది? ఆనంద్ ఎలా కేసులను పరిష్కరించాడు? అన్నది తెలుసుకోవాలంటే అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా చూడాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

200 కోట్లకు పైగా కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు