Valari Movie: ఓటీటీలోకి వస్తోన్న దెయ్యం సినిమా.. భయపెట్టేందుకు రెడీ అయిన రితికా సింగ్ ‘వళరి’..

గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీరామ్ హీరోగా నటిస్తున్నారు. కె.సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‍తో సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. తాజాగా శుక్రవారం విడుదలైన ట్రైలర్‏తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ వచ్చేసింది.

Valari Movie: ఓటీటీలోకి వస్తోన్న దెయ్యం సినిమా.. భయపెట్టేందుకు రెడీ అయిన రితికా సింగ్ 'వళరి'..
Valari Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 02, 2024 | 7:06 AM

ఇప్పుడు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. హారర్ కంటెంట్.. కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్షుద్రపూజలు, దెయ్యాల సినిమాలదే ఇప్పుడు హావా నడుస్తుంది. విరూపాక్ష సినిమా నుంచి మొన్నటి పొలిమేర 2, పిండం వరకు భయపెట్టే హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త దెయ్యం సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వళరి. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీరామ్ హీరోగా నటిస్తున్నారు. కె.సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్‍తో సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. తాజాగా శుక్రవారం విడుదలైన ట్రైలర్‏తో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఆద్యంతం భయపెట్టే సన్నివేశాలతో సాగిన ఈ వళరి ట్రైలర్ ఆకట్టుకుంటుంది. “చేసిన హత్యలను కిల్లర్ మర్చిపోతే.. ఆ మరణించినవారు కిల్లర్‏ను మర్చిపోతారా” అంటూ మూవీపై క్యూరియాసిటిని కలిగించారు.

అది వెంకటాపురం బంగ్లా.. దెయ్యాల కొంప.. అనే డైలాగ్‏తో మొదలైన ట్రైలర్.. మూడు కొత్త పాత్రలను పరిచయం చేస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పూర్తిగా హారర్ ఎలిమెంట్స్ ఎక్స్‎ట్రార్టినరీగా రూపొందించిన ఈసినిమాలో మరోసారి తన నటనతో కట్టిపడేసింది రితికా సింగ్. ఇక ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది డైరెక్టర్ మృతిక సంతోషిణి.

వెంకటాపురం బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని ఊళ్లో వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ ఇంట్లోకి ఓ కుటుంబ దిగుతుంది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమా. పూర్తిగా ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలపై ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆహా ఓటీటీలో పిండం సినిమాతో భయపెట్టిన శ్రీరామ్.. ఈసారి వళరి సినిమాతో మరోసారి టెన్షన్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ప్రాచీన కాలానికి చెందిన వళరి అనే ఆయుధంతో ఈ హారర్ స్టోరీని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.