Abraham Ozler: మరో ఓటీటీలోకి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రలు పోషించిన సినిమా అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.. దాదాపు రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా గతంలోనే ఓటీటీలోకి వచ్చేసింది.
ఇప్పుడు మలయాళీ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అక్కడి చిన్న చిత్రాల కంటెంట్ జనాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. దీంతో అటు బాక్సాఫీస్ వద్ద.. ఓటీటీలో మలయాళీ మూవీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న ప్రేమలు సినిమాలు తెలుగులోకి తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక ఇప్పుడు హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రలు పోషించిన సినిమా అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.. దాదాపు రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా గతంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్ కీలకపాత్రలు పోషించారు. మిథున్ కెరీర్ లోనే అత్యధిక బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. అబ్రహం (జయరాం) భార్య పిల్లలను కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. అయితే వారు కనిపించకుండా పోయినా తన దగ్గరే ఉన్నట్లు అబ్రహం ఊహించుకుంటాడు. ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతుంటారు. మృతుల వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసిన పేపర్లు దొరుకుతాయి. అయితే వారిని చంపిందెవరు ? ఈ సినిమాలో అలెక్స్ (మమ్ముట్టి) కిల్లర్ గా మారడానికి కారణమేంటీ ? అబ్రహం భార్య పిల్లలు ఏమయ్యారు ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.