Reliance Disney: రిలయన్స్, డిస్నీ మధ్య డీల్.. ఒకే గొడుకు కిందకు 120 ఛానళ్లు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 .. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 .. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 2024 చివరి త్రైమాసికంలో గానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విలీనం తర్వాత సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. ఈ సంస్థకు స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానెళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్, జియో సినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి. భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లు అయిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరకే కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos