AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : వార్నీ.. ఏం ట్విస్టులు రా అయ్యా.. అనుక్షణం ఉత్కంఠ.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..

ఇటీవల ఓటీటీలో ఆద్యంతం ఆకట్టుకునే కొత్త కొత్త జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకులను చివరి నిమిషం వరకు కూర్చోబెట్టేలా చేస్తుంది. ఇందులో ఊహించని ఒక ట్విస్ట్ ఉంది. అది మొత్తం కథ దిశను మారుస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందామా.

Cinema :  వార్నీ.. ఏం ట్విస్టులు రా అయ్యా.. అనుక్షణం ఉత్కంఠ.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
Dna Movie
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2025 | 6:55 AM

Share

ఈ వీకెండ్‏లో మీరు ఏదైనా మంచి సినిమా చూడాలనుకుంటే, ఈ సినిమా మీకు కరెక్ట్ ఛాయిస్. యాక్షన్, ఎమోషన్ తో పాటు డ్రామా-థ్రిల్లర్ సినిమా గురించి తెలుసుకోండి. 2 గంటల 20 నిమిషాల నిడివి గల ఈ సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రతి నిమిషం మిమ్మల్ని పూర్తిగా కట్టిపడేస్తుంది. ఇది చాలా చిన్న బడ్జెట్ థ్రిల్లర్ మూవీ. కానీ ఈ సినిమాలోని ట్విస్టులు మీ మనసును భయంతో కదిలిస్తుంటాయి. కాల గ్రహ నక్షత్రంతో వచ్చే క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. జ్యోతిష్యం, సైన్స్ ల ఘర్షణతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అద్భుతమైన క్లైమాక్స్, మనసును కదిలించే మలుపులు ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురిచేస్తాయి. అదే DNA.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

కోలీవుడ్ హీరో అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం DNA. తమ ప్రాణాల కోసం పోరాడుతున్న ఇద్దరు వ్యక్తుల గురించే ఈ సినిమా. ఇందులో దివ్యకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ఆనంద్ తన మొదటి ప్రేమను కోల్పోయిన తర్వాత మానసికంగా కుంగిపోతాడు. అతను పునరావాస కేంద్రం నుండి తిరిగి రావడంతో తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలనుకుంటున్నారు. దివ్య, ఆనంద్ వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజున ఆనంద్ స్నేహితుడు దివ్య మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని తెలుసుకుని వివాహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ప్రతిదీ తెలిసినప్పటికీ ఆనంద్ దివ్యను పెళ్లి చేసుకుంటారు. వివాహం తర్వాత ఇద్దరూ చాలా సంతోషంగా . ఒక రోజు ఇంట్లో పసికందు నవ్వుల శబ్దం వినబడుతుంది. దివ్య తన నవజాత శిశువు మారిపోయిందని చెబుతుంది. మొదట భర్త ఆనంద్ తన భార్య భ్రమలో ఉందని అనుకుంటాడు.. కానీ క్రమంగా అతను కూడా నిజాన్ని తెలుసుకుంటాడు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..

కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఇది జ్యోతిషశాస్త్రం, గ్రహాలు, మానసిక సంఘర్షణలు, అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా సిండికేట్‌లోకి సాగుతుంది. సామాజిక పక్షపాతం, అనారోగ్య మనస్తత్వం, ‘రుజువు చేసే భారం’ ఒక స్త్రీ మాతృత్వాన్ని ఎలా ప్రశ్నార్థకం చేస్తాయో ఈ చిత్రం చూపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని టెన్షన్, థ్రిల్‌ను రెట్టింపు చేస్తుంది. ఈ చిత్రం ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెల్సన్ వెంకటన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం వంటి భాషలలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..