Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..
సినీరంగంలో చాలా మంది హీరోయిన్స్ కొన్ని హద్దులు క్రియేట్ చేసుకుంటారు. కొందరు గ్లామర్ రోల్స్ చేసేందుకు ఇష్టపడరు. మరికొందరు కొన్ని సీన్స్ లో నటించేందుకు ఎప్పటికీ అంగీకరించరు. కానీ ఇలా షరతులు పెట్టుకోవడంతో ఎన్నో ఆఫర్స్ మిస్ అవుతుంటారు. ఈహీరోయిన్ సైతం అనేక అవకాశాలు కోల్పోయింది.

ప్రస్తుతం సినీరంగంలో హీరోయిన్లుగా నటిస్తున్న తారలు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నవారే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్స్ గ్లామరస్ రోల్స్ చేసేందుకు ఇష్టపడరు. రొమాంటిక్ సీన్స్ చేసేందుకు దూరంగా ఉంటారు. అయితే ఇలా గ్లామర్ షోకు దూరంగా ఉండే తారలు చాలా అవకాశాలు కోల్పోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం రొమాంటిక సీన్లకు దూరంగా ఉండడంతో అవకాశాలు కోల్పోయిందట. ఆమె పేరు శ్రుతి శర్మ. కొన్ని రోజుల క్రితం ఓటీటీలో విజయం సాధించిన హిరామండి వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది.
శ్రుతి శర్మ విషయానికి వస్తే.. 2018లో గత్ బంధన్ అనే టీవీ షోతో కెరీర్ స్టార్ట్ చేసింది. .యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిచన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పగ్లైట్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో కట్టిపడేసినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు.
అయితే తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని.. స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రొమాంటిక్ సీన్స్ చేయనని చెప్పడంతో చాలా అవకాశాలు కోల్పోయినట్లు తెలిపింది. తన నిర్ణయం గురించి ఎలాంటి బాధ లేదని తెలిపింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ శ్రుతి శర్మ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..








