AHA: సంక్రాంతికి ఆహా అనిపించే కంటెంట్.. డిజిటల్ వీక్షకులకు ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్..
AHA: తొలి తొలిగి ఓటీటీగా దూసుకొచ్చింది ఆహా. ఓటీటీ వేదికపై సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలకే పరిమితం కాకుండా తమకు మాత్రమే సొంతమైన కొన్ని టాక్ షోలతో..
AHA: తొలి తొలిగి ఓటీటీగా దూసుకొచ్చింది ఆహా. ఓటీటీ వేదికపై సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలకే పరిమితం కాకుండా తమకు మాత్రమే సొంతమైన కొన్ని టాక్ షోలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహా వేదికగా టెలికాస్ట్ అవుతోన్న బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేటింగ్స్‌లో దూసుకుపోతూ సరికొత్త రికార్డును తిరగరాసిందీ షో. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగకు డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమైంది ఆహా. ఇందులో భాగంగా సంక్రాంతికి ఆహాలో విడుదల కానున్న సినిమాలు, స్పెషల్ ప్రోగ్రామ్‌పై ఓ లుక్కేయండి..
అన్‌స్టాపబుల్‌తో సరికొత్త ఎక్స్‌పిరీయన్స్‌ను పరిచయం చేసిన ఆహా. సంక్రాంతి కానుకగా స్పెషల్ గెస్ట్‌లను తీసుకొచ్చింది. నేడు (శుక్రవారం) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో లైగర్ టీమ్ సందడి చేయనుంది. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, చార్మీ సందడి చేయనున్నారు.
ఇక ఆహా వేదికగా విడుదలవుతోన్న మరో సినిమా ది అమెరికన్ డ్రీమ్. జనవరి 14న ఈ ఆహా ఒరిజినల్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెరికా వెళ్లిన ఓ మధ్య తరగతి కుర్రాడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అన్న ఆసక్తికర కథనంతో ఈ సినిమా రానుంది. ప్రిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే చిత్రంపై మంచి బజ్‌ను తీసుకొచ్చింది. ఇలా టాక్‌షో, సినిమాతో సంక్రాంతికి డబుల్ ట్రీట్ ఇవ్వనుంది ఆహా.
Also Read: LPG Subsidy: వంట గ్యాస్ సబ్సిడీ మీ ఖాతాలో పడుతుందో లేదో ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి..
Bangarraju Pre Release Event: బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో
Sankranti – Omicron: పండుగ వేళ డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు.. ఎందుకంటే..