Arjuna Phalguna in OTT: ‘అర్జున ఫల్గుణ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. శ్రీవిష్ణు సందడి ఎప్పటినుంచి అంటే
యంగ్ హీరో శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృతా అయ్యర్ జంటగా ఇటీవల ప్రేక్షకులను పలకరించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఇక ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదలకు సిద్దమయ్యింది.
యంగ్ హీరో శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృతా అయ్యర్ జంటగా ఇటీవల ప్రేక్షకులను పలకరించిన చిత్రం అర్జున ఫల్గుణ. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించగా.. తేజ మార్ని దర్శకత్వం వహించారు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ సినిమాలు చేస్తూ చూసుకుపోతున్నాడు. ఆ క్రమంలో డిసెంబర్ 31న థియేటర్లలో విడుదలైన అర్జున ఫల్గుణ ప్రేక్షకులను మెప్పించింది. గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా.. అలాగే హీరోయిన్ గ్రామ వాలంటీర్‌గా కనిపించారు. ఇక ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం జనవరి 26 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ.. ఆహా టీమ్ ట్వీట్ వేసింది.
View this post on Instagram
హాస్య సన్నివేశాలతో తప్పకుండా కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నరేశ్, సుబ్బరాజు, మహేశ్, శివాజీ రాజా ఈమూవీలో కీ రోల్స్ పోషించారు. ప్రియదర్శన్ సంగీతం అందించాడు.
Also Read: Viral Photo: తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?