AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman OTT: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలోకి తేజ సజ్జా ‘హనుమాన్‌’.. ఆ పండగ రోజే స్ట్రీమింగ్‌

ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సూపర్ హీరో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ ఫిక్స్ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

Hanuman OTT: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలోకి తేజ సజ్జా 'హనుమాన్‌'.. ఆ పండగ రోజే స్ట్రీమింగ్‌
Hanuman Movie
Basha Shek
|

Updated on: Mar 01, 2024 | 2:42 PM

Share

ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సూపర్ హీరో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ ఫిక్స్ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. యంగ్‌ హీరో తేజ సజ్జా, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌ లో రూపొందిన సినిమా ‘హనుమాన్‌’. సూపర్ హీరో కాన్సెప్ట్ తో మన దేశంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే. భారీ పోటీ మధ్య సంక్రాంతి కానుకగా 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి నిర్మాతలకు కాసుల పంట పండించింది. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడింది. త్వరలోనే హనుమాన్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగోలు చేసింది. తాజాగా తేజ సజ్జా సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. మహాశివరాత్రి పర్వదినం అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాల కానుకగా మార్చి 8 నుంచి హనుమాన్ మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ.

హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో సోదరి పాత్రలో ఆకట్టుకుంది. ఇక వాన ఫేమ్ వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. సముద్ర ఖని, వెన్నెల కిశోర్, జబర్దస్త్‌ శీను, తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. ప్రైమ్‌ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్‌ రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మించారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారా? లేదా ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే జస్ట్ ఒక వారం రోజులు వెయిట్ చేయండి. డైరెక్టుగా మీ ఇంట్లోకే వచ్చేస్తోంది.

ఇవి కూడా చదవండి

శివరాత్రి రోజే స్ట్రీమింగ్..

ఎమోషనల్ సాంగ్ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?