AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మిరాయ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

ఇటీవల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా మిరాయ్. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మిరాయ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Mirai
Rajitha Chanti
|

Updated on: Oct 04, 2025 | 12:48 PM

Share

హనుమాన్ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్న తేజా సజ్జా.. ఇటీవల మిరాయ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో మంచు మనోజ్ కీలకపాత్రలో నటించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని విజువల్స్, బీజీఎమ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా తేజా సజ్జా, మంచు మనోజ్ యాక్టింగ్ కు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని ప్రతీ సీన్ హైలెట్ అయ్యింది. ఇందులో రితిక నాయక్ కథానాయికగా నటించింది. ఇన్నాళ్లు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్ పంచుకుంది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో ఇన్నాళ్లు థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సైన అడియన్స్ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

కథ విషయానికి వస్తే.. సామ్రాట్ అశోక్ కళింగ యుద్దం గెలిచాక.. జరిగిన విధ్వంసాన్ని తలుచుకుని పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలోని దైవశక్తే ఓ కారణమని భావించి.. ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా (మంచు మనోజ్ ) కన్ను పడుతుంది. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ? తొమ్మిదో గ్రంథానికి రక్షణగా ఉన్న అంబిక ఎవరు.. ? తేజా సజ్జాకు ఆమెకు ఉన్న బంధం ఏంటీ ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..