Cinema : థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న మూవీ..
ఈ సంవత్సరం చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి. వాటిలో ఒకటి ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఫ్లాప్ చిత్రం దేశంలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఏంటో తెలుసా.. ? ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది.

థియేటర్లలో ప్లాప్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. అదే “సన్ ఆఫ్ సర్దార్ 2” అనే కామెడీ డ్రామా. ఈ ఏడాది ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, రోష్ని వాలియా, విందు దారా సింగ్, దీపక్ దోబ్రియాల్, కుబ్రా సైట్, సంజయ్ మిశ్రా, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన బజ్ సృష్టించింది, కానీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. మొదట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
కానీ ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల, “సన్ ఆఫ్ సర్దార్ 2” నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం 2012లో విడుదలైన “సన్ ఆఫ్ సర్దార్” కి సీక్వెల్. అయితే, బలహీనమైన కథ కారణంగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. “సన్ ఆఫ్ సర్దార్ 2” తొలి వారాంతంలో సింగిల్ డిజిట్ కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు రూ.7.50 కోట్లు, రెండవ రోజు ₹8.25 కోట్లు, మూడవ రోజు ₹9 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
అజయ్ దేవగన్ చిత్రం “సన్ ఆఫ్ సర్దార్ 2” ₹150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం భారతదేశంలో ₹43.24 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹60.9 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?




