Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌’.. ఎక్కడ చూడొచ్చేంటే?

కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ లవ్‌ డ్రామాలో శివాని నగరం కథానాయికగా నటించింది. ఫిదా, భామకలాపం 2 మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న శరణ్యా ప్రదీప్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

Ambajipeta Marriage Band OTT: ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ 'అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌'.. ఎక్కడ చూడొచ్చేంటే?
Ambajipeta Marriage Band Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2024 | 3:58 PM

కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో సోలో హీరోగా సాలిడ్ హిట్స్ అందుకున్నాడు సుహాస్. ఇటీవలే అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ లవ్‌ డ్రామాలో శివాని నగరం కథానాయికగా నటించింది. ఫిదా, భామకలాపం 2 మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న శరణ్యా ప్రదీప్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేశాడు సుహాస్. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (మార్చి 1) అర్ధరాత్రి నుంచి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా ఓటీటీ. మల్లిగాడి మ్యారేజి బ్యాండు ప్రతి ఇంట్లో మోగుతుంది. మీరు కూడా ఈ ప్రయాణంలో భాగమవ్వండి’ అని ఆహా ట్వీట్ చేసింది.

ఇక హీరో సుహాస్ కూడా ‘పల్లెటూరి వాతావరణంలో మంచి పాటలతో, అంతకంటే మంచి కథలతో అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ఇప్పుడు ఆహాలో’ అటూ వీడియో బైట్ ఇచ్చాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌ సినిమాను నిర్మించాయి. నితిన్‌ ప్రసన్న, గాయత్రి భార్గవి, గోపరాజు రమణ, జగదీష్‌ ప్రతాఫ్‌ భండారి, వినయ్‌ మహదేవ్‌, దివ్యా చలం శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.శేఖర్ చంద్ర స్వరపరిచిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?