Ambajipeta Marriage Band OTT: అఫీషియల్.. ఆహాలో మోగనున్న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే హీరోగా సుహాస్ కు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి హిట్ కొట్టాడు సుహాస్. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో హీరోగా మరో సాలిడ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలా ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మన ముందుకు వచ్చాడు సుహాస్. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్ గా నటించింది. అలాగే ఫిదా ఫేమ్ శరణ్యా ప్రదీప్ మరో కీలక పాత్ర పోషించింది. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను నిర్మించాయి. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే హీరోగా సుహాస్ కు హ్యాట్రిక్ సక్సెస్ ఇచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కీలక అప్ డేట్ ఇచ్చింది ఆహా. ‘మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి’ అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను త్వరలో ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ ట్వీట్ చేసింది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మొన్నటి వరకు మార్చి 8 న లేదా మార్చి 15న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం మార్చి 1 నుంచి అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మోగనుంది. విలేజ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, గాయత్రి భార్గవి, గోపరాజు రమణ, జగదీష్ ప్రతాఫ్ భండారి, వినయ్ మహదేవ్, దివ్యా చలం శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.శేఖర్ చంద్ర స్వరపరిచిన స్వరాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కుల వివక్ష కారణంగా అన్నా చెల్లెళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారది ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్. దీనికి చక్కటి ప్రేమకథను కూడా జోడించాడు.
Get ready to fall into the magical world of ‘Malligadu’ ❤️#AmbajipetMarriageBand Coming Soon only on @ahavideoIN#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati #ShekarChandra @ashishtejapuala @GA2Official @Mahayana_MP… pic.twitter.com/nfk2EZQmZs
— ahavideoin (@ahavideoIN) February 23, 2024
బాక్స్ ఆఫీస్ దగ్గర మల్లిగాడి మోత
బాక్స్ ఆఫీస్ దగ్గర మల్లిగాడి మోత 🥁🥁#AmbajipetaMarriageBand grosses 11.7 CRORES WORLDWIDE in the first week ❤️🔥
Book your tickets for the HARD HITTING BLOCKBUSTER now!#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @KalyanKodati… pic.twitter.com/Ta1VnHhP9P
— FlyHigh Cinemas (@FlyHighCinemas) February 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి