Squid Game: ‘స్క్విడ్ గేమ్ – ది ఛాలెంజ్’ని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్.. గెలిస్తే రూ. 36 కోట్లు మీ సొంతం..
ఈ రియాలిటీ షోలో, ఒరిజినల్ వెబ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందిన అనేక గేమ్‌ల ద్వారా పోటీదారులు పోటీ పడతారని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇది మాత్రమే కాదు
ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సౌత్ కొరియా వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ అభిమానులకు శుభవార్త. కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రకటంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు భారీ ఆఫర్ ఇచ్చింది. మంగళవారం (జూన్ 14) చేసిన ప్రకటనతో అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. వాస్తవానికి, నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ నుంచి ప్రేరణ పొందిన బిగ్గెస్ట్ రియాలిటీ షోను ప్రకటించింది.
ఈ షో విజేతకు రూ.36 కోట్లు..
రిపోర్ట్స్ ప్రకారం ఈ షో దాదాపు ‘స్క్విడ్ గేమ్’ లాగా ఉంటుందని సమాచారం. ఈ షో విజేతకు $ 4.56 మిలియన్లు అంటే దాదాపు రూ. 36 కోట్లు ఇవ్వనున్నారు. ఏదైనా రియాలిటీ షో చరిత్రలో ఇది అతిపెద్ద వన్-టైమ్ క్యాష్ ప్రైజ్ ఆఫర్ అవుతుందని భావిస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుంచి 456 మంది పోటీదారులు ఈ రియాలిటీ షోలో పాల్గొంటారంట. అయితే ఈ షోలో ‘స్క్విడ్ గేమ్’ అనే వెబ్ సిరీస్‌లో లాగా కంటెస్టెంట్స్ తమ జీవితాలను లైన్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. నివేదికల ప్రకారం, ఈ సిరీస్ 10 ఎపిసోడ్‌లను కలిగి ఉంటుంది. ఏ నెట్‌ఫ్లిక్స్ ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్’ అని పేరుతో ఇది రానుంది.
వెబ్ సిరీస్ ప్రేరణతో..
ఈ రియాలిటీ షోలో, ఒరిజినల్ వెబ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందిన అనేక గేమ్‌లలో పోటీదారులు పోటీ పడతారని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇది మాత్రమే కాదు, సిరీస్ నుంచి ప్రేరణ పొందిన గేమ్‌లు కాకుండా, ప్రదర్శనలో అనేక కొత్త గేమ్‌లు కూడా ఉంటాయంట. ప్రదర్శనలో ఆటగాళ్ల ‘వ్యూహాలు, పొత్తులు, పాత్రలు’ పరిశీలించి, ఎలిమినేషన్, విన్నర్‌లను డిసైడ్ చేస్తారు. ప్రతి రౌండ్‌లో ఓడిపోయిన పోటీదారులందరూ ఎలిమినేట్ అవుతారు. ఇందులో అన్ని గేమ్‌లను గెలిచిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు.
Do you want to play a game? Enter to join Squid Game: The Challenge at https://t.co/MaXfZnqmvb pic.twitter.com/6gYLXlplDC
— Netflix (@netflix) June 14, 2022
“YouTube క్రియేటర్లలో ఒకరైన Mr.Beast, దక్షిణ కొరియాకు చెందిన ‘రెడ్ లైట్, గ్రీన్ లైట్’ వంటి షోలను చూసి రియాలిటీ షో ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఇది డ్రామా సిరీస్. షోలోని మొత్తం 456 మంది పోటీదారుల కోసం ఒక పరికరం ఇన్‌స్టాల్ చేస్తాం. ఇది ఆటగాడు అవుట్ అయినప్పుడు బుల్లెట్ షాట్‌ను ఇస్తుంది. రియాల్టీ షో యూకేలో చిత్రీకరించనున్నారు. ఈ షోలో కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవారు మాత్రమే నటిస్తారు” అని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.