AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakeela: సొంత డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను ప్రారంభించిన మరో హీరోయిన్..

కరోనా మహమ్మారి అంతా మార్చేసింది. ప్రజలు జీవన విధాన్ని మొత్తం చేంజ్ చేసింది ఈ వైరస్. దీని దెబ్బకు పెద్ద పెద్ద పరిశ్రమలే కుదేలయ్యాయి.

Shakeela: సొంత డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను ప్రారంభించిన మరో హీరోయిన్..
Shakeela
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 19, 2021 | 6:18 AM

Share

Shakeela: కరోనా మహమ్మారి అంతా మార్చేసింది. ప్రజలు జీవన విధాన్ని మొత్తం చేంజ్ చేసింది ఈ వైరస్. దీని దెబ్బకు పెద్ద పెద్ద పరిశ్రమలే కుదేలయ్యాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ. కరోనా దెబ్బకు థియేటర్స్ ముడతపడ్డ విషయం తెలిసిందే. దాంతో రకరకాల డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలా ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి..ఇంకొన్ని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. తాజాగా కొంతమంది సినిమాతారలు కూడా ఓటీటీ సంస్థలను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల హీరోయిన్ నమిత మీడియాతో మాట్లాడుతూ.. తాను నమిత థియేటర్ అనే ఓటీటీని ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఓటీటీ మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థను కూడా మొదలుపెట్టనున్నట్టు ఆమె తెలిపారు.  ఇప్పుడు అదే బాటలో నటి షకీల కూడా అడుగులు వేస్తున్నారు.

బి గ్రేడ్ హీరోయిన్ గా ఒకప్పుడు స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న షకీల కూడా ఓటీటీ సంస్థను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. షకీల తన ఓటీటీలో వరుసగా సినిమాలను అందించబోతున్నట్లుగా ఆమె తెలిపారు. గతంలో తన సినిమా విడుదల కోసం సెన్సార్ బోర్డు చుట్టు చాలా తిరిగాను. అయినా కూడా వారు నా సినిమాకు సెన్సార్ ఇవ్వలేదు. అందుకే చేసేది లేక డిజిటల్ గా విడుదల చేశాను. ఇలా మరొకరికి జరగకూడదు అందుకే ఓటీటీని ప్రారంబిస్తున్నా అని ఆమె తెలిపారు. ఇక షకీల తెరకెక్కిస్తున్న సినిమాల్లో ఒకటి ‘అట్టర్ ప్లాప్ మూవీ’ అనే టైటిల్ తో రూపొందుతుంది. మరోటి రొమాన్స్ అనే టైటిల్ తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు ఓటీటీలో విడుదల అవ్వనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kamal Haasan : షూటింగ్ రీ స్టార్ట్ చేసిన విశ్వనటుడు.. విలన్ గా మక్కల్ సెల్వన్..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?