Operation Alamelamma OTT: ఓటీటీలో ‘సైతాన్’ నటుడి మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తోన్న శ్రద్ధ ఓటీటీలోనూ అదరగొడుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ సందడి చేస్తోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే అంతకుముందే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది శ్రద్ధా శ్రీనాథ్.
శ్రద్ధా శ్రీనాథ్.. పేరు చెచితే ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు.. నాని నటించిన జెర్సీ సినిమా హీరోయిన్ అంటే అందరి మదిలో ఇట్టే మెదులుతుంది. అందులో నాని భార్య సారా పాత్రలో శ్రద్ధా అభినయం అందరినీ ఆకట్టుకుంది. దీని తర్వాత జోడీ, శ్రీకృష్ణ అండ్ హిజ్ లిలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తోన్న శ్రద్ధ ఓటీటీలోనూ అదరగొడుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ సందడి చేస్తోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే అంతకుముందే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది శ్రద్ధా శ్రీనాథ్. 2017లో కన్నడలో విడుదలైన ఆపరేషన్ అలమేలమ్మ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సూపర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సైతాన్ వెబ్ సిరీస్ ఫేమ్ రిషి కీ రోల్ పోషించాడు. శ్రద్ధా శ్రీనాథ్ మరో ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా తెలుగులోకి రానుంది. ఆపరేషన్ అలమేలమ్మ పేరుతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. అక్టోబర్ 27 నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అడిషన్ చేసినా, సబ్ ట్రాక్షన్ చేసినా, ఈ కథకు ఈక్వల్ అవ్వదురా సామి.. సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది.
ఆపరేషన్ అలమేలమ్మ మూవీకి సునీల్ దర్శకత్వం వహించాడు. రాజేష్ నటరంగ, అరుణ్ బాలాజీ, షీలమ్, విశ్వవిజేత్, ధీరజ్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్ సినిమాస్ స్టార్ ఫ్యాబ్ బానర్‌పై అమ్రేజ్ సూర్యవంశీ సునీల్ ఈ సిమాను నిర్మించారు. జుధాహ్ సంధీ సంగీతం అందించారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. డబ్బుపై మోజుతో పరమేష్ అనే అనాథ యువకుడు బిజినెస్‌మెన్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. దీని తర్వాత పరమేష్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? కిడ్రాప్ డ్రామాలో అనన్య అనే స్కూల్ టీచర్‌కు సంబంధమేంటో తెలుసుకోవాలంటే ఆపరేషన్ అలమేలమ్మ సినిమా చూడాల్సిందే.
ఆహాలో స్ట్రీమింగ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..