AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scam 2003 OTT: ‘స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ’ పార్ట్‌ 2 వచ్చేస్తోంది.. అఫీషియల్ స్ట్రీమింగ్‌ డేట్ ఇదే

2003లో దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ స్కామ్‌ '2003.. ది తెల్గీ స్టోరీ'. ఈ కుంభకోణంలో అరెస్టై జైలులోనే కన్నుమూసిన అబ్దుల్‌ కరీం తెల్గీ జీవితంలోని వాస్తవ సంఘటలను ఈ వెబ్‌సిరీస్‌లో చక్కగా చూపించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్‌ పార్ట్‌-1 సెప్టెంబర్‌ 2న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి.

Scam 2003 OTT: 'స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ' పార్ట్‌ 2 వచ్చేస్తోంది.. అఫీషియల్ స్ట్రీమింగ్‌ డేట్ ఇదే
Scam 2003 The Telgi Story
Basha Shek
|

Updated on: Oct 20, 2023 | 5:16 PM

Share

2003లో దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ స్కామ్‌ ‘2003.. ది తెల్గీ స్టోరీ’. ఈ కుంభకోణంలో అరెస్టై జైలులోనే కన్నుమూసిన అబ్దుల్‌ కరీం తెల్గీ జీవితంలోని వాస్తవ సంఘటలను ఈ వెబ్‌సిరీస్‌లో చక్కగా చూపించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్‌ పార్ట్‌-1 సెప్టెంబర్‌ 2న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. మొదటి పార్ట్‌లో కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్‌ కరీం తెల్గీ ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలి ముంబయి రావడం, అక్కడ కొందరు స్నేహితులను కలవడం, నకిలీ స్టాంప్‌ పేపర్లను ముద్రించడం వంటి అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు మేకర్స్‌. అయితే కరీం తెల్గీ స్టాంప్‌ పేపర్ల కుంభ కోణం ఎలా బయటపడింది? దీని వెనక బాధ్యులు అన్నది మాత్రం చూపించలేకపోయారు. జైలులో తెల్గీకి ఎలాంటి పరిస్థితులు ఎదరయ్యాయి? అన్నది రెండో భాగంలో చూపించనున్నారు. ఈ క్రమంలో స్కామ్‌ 2023 పార్ట్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. నవంబర్‌ 3వ తేదీ నుంచి రెండో భాగాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు అధారకారికంగా ప్రకటించారు. మొదటి పార్ట్‌లో మొత్తం 5 ఎపిసోడ్స్‌ ఉంటే రెండో పార్ట్‌లో కూడా ఐదు ఎపిసోడ్సే ఉండనున్నట్లు సమాచారం.

స్కామ్‌ 2023 ది తెల్గీ స్టోరీ వ్యాల్యూమ్‌ 2 కు సంబంధించి ఒక టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్‌ . ఇందులో తెల్గీ జైలు జీవితం, పోలీసుల విచారణ వంటి అంశాలను చూపించారు. తుషార్‌ హీరానందని తెరకెక్కించిన స్కామ్‌ 2023 వెబ్‌ సిరీస్‌లో అబ్దుల్‌ కరీం పాత్రలో గగన్‌ దేవ్‌ రియార్‌ నటించారు. అలాగే అనిరుద్ధ్ రాయ్, సత్యం శ్రీవాస్తవ, విశాల్ సి. భరద్వాజ్ తదిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఇవి కూడా చదవండి

నవంబర్ 3 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్

కరీం తెల్గీ జైలులో ఎలా చనిపోయారు?

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి