MaruthiNagar Subramanyam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రావు రమేశ్ కామెడీ డ్రామా.. ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

చాలా కాలంగా సైడ్ రోల్స్ పోషిస్తున్న రావు రమేశ్.. ఇటీవల హీరోగా ఓ చిత్రంలో నటించాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే మరోసారి ఈ మూవీలో తనదైన నటనతో అలరించాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాలేదు.

MaruthiNagar Subramanyam OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రావు రమేశ్ కామెడీ డ్రామా.. 'మారుతీనగర్ సుబ్రమణ్యం' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Maruthi Nagar Subramanyam
Follow us

|

Updated on: Sep 13, 2024 | 6:08 PM

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు రావు రమేష్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో సహాయ పాత్రలు, విలన్ పాత్రలు పోషించి అద్భుతమైన నటనతో మెప్పించారు. తనదైన సహజ నటనతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో మార్క్ సృష్టించాడు. చాలా కాలంగా సైడ్ రోల్స్ పోషిస్తున్న రావు రమేశ్.. ఇటీవల హీరోగా ఓ చిత్రంలో నటించాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే మరోసారి ఈ మూవీలో తనదైన నటనతో అలరించాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాలేదు. అలాగే జనాలకు కూడా అంతగా రీజ్ కాలేదు. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ అంతగా రాలేకపోయాయి.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా సెప్టెంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. ఇందులో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కీలకపాత్రలు పోషించగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే..

సుబ్రమణ్యం (రావు రమేశ్) ఓ నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికైనా.. అది కాస్తా కోర్టు గొడవలతో చేతికందదు. దీంతో భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపైనే ఆధాపడుతుంటాడు. అబ్బాయి అర్జున్ (అంకిత్ కొయ్య) పెద్దయ్యాక కూడా సుబ్రమణ్యానికి ఉద్యోగం రాదు. ఇక అర్జున్ కాంచన (రమ్య పసుపులేటి )తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి పెళ్లి కోసం కాంచన ఇంటికి వెళ్లి సుబ్రమణ్యానికి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది.. ? తన ఖాతాలో పడిన రూ.10 లక్షల డబ్బును అవసరాల కోసం తండ్రీ కొడుకులు ఖర్చు చేశాక ఏం జరిగిందనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..