Salaar Movie: హాలీవుడ్లో దుమ్మురేపుతున్న ‘సలార్’.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్లో ప్రభాస్ హవా..
కేజీఎఫ్ 1, 2 బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. ఇటు చాలా కాలం తర్వాత డార్లింగ్ మాస్ అవతారం.. యాక్షన్ డ్రామా చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ ఈ మూవీ దాదాపు రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక థియేటర్లలో సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ ఏ రేంజ్లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అత్యధిక వసూళ్లతో దూసుకుపోయింది. కేజీఎఫ్ 1, 2 బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. ఇటు చాలా కాలం తర్వాత డార్లింగ్ మాస్ అవతారం.. యాక్షన్ డ్రామా చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ ఈ మూవీ దాదాపు రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక థియేటర్లలో సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అటు డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఈ నాలుగు భాషలకే ట్రెండ్ లో ఉంది.. ఇక హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తే మరింత వైరల్ అయ్యేది. గత రెండు రోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్లో సలార్ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. డైరెక్షన్, డార్లింగ్ యాక్షన్ పై ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సలార్ మేనియా కొనసాగుతుంది. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి సైతం ఈరేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
అప్పట్లో ట్రిపుల్ ఆర్ సినిమాపై ఇదే రేంజ్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మళ్లీ సలార్ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. త్వరలోనే సలార్ ఇంగ్లీష్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2పై కసరత్తులు చేస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి త్వరలోనే రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, ఈశ్వరీ రావు కీలకపాత్రలు పోషించగా.. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




