Mangalavaaram OTT: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘మంగళవారం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆకట్టుకునే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లే మంగళవారం సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించింది. అన్నిటికీ మించి ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి విజయం లేని పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతిలకు ఒక మంచి సాలిడ్ సక్సెస్ ఇచ్చింది మంగళవారం సినిమా. నవంబర్ 17న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన మంగళవారం సినిమా మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హార్రర్ థ్రిల్లర్ ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం సినిమా ప్రేక్షకులనుబాగా ఆకట్టుకుంది. ఆకట్టుకునే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లే మంగళవారం సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించింది. అన్నిటికీ మించి ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి విజయం లేని పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అజయ్ భూపతిలకు ఒక మంచి సాలిడ్ సక్సెస్ ఇచ్చింది మంగళవారం సినిమా. నవంబర్ 17న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంగళవారం సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 26) అర్ధరాత్రి నుంచే పాయల్ రాజ్‌పుత్ సినిమాను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి ఇటీలే అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాల భాషల్లో మంగళవారం స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.
కాగా మంగళవారం సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే మంగళవారమే పాయల్ రాజ్‌పుత్ సినిమా ఓటీటీలోకి రానుంది.మిస్టీరియస్ థ్రిల్లింగ్ కాన్సెప్టెతో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. నందితా శ్వేత, అజ్మల్ అమీర్, ప్రియదర్శి, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రావణ్ రెడ్డి, శ్రీ తేజ్, తరుణ్ భాస్కర్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. కాగా మంగళవారం’ సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయమయ్యారు. దర్శకుడు అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాంతార, విరూపాక్ష ఫేమ్ అజనీష్ అందించిన స్వరాలు, బీజీఎమ్ మంగళవారం సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
Enigmas, mysteries and chaos! #MangalvaaramonHotstar Streaming in 6hrs only on #DisneyPlusHotstar@DirAjayBhupathi @starlingpayal @Nanditasweta @AJANEESHB #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/PUCFTTRLL7
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) December 25, 2023
మంగళవారం సీక్రెట్స్ ఏంటి?
Unmask the covert secrets of Mangalvaaram 🥵#MangalvaaramonHotstar Streaming from 26th Dec only on #DisneyPlusHotstar@DirAjayBhupathi @starlingpayal @Nanditasweta @AJANEESHB #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/jQf0u341da
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) December 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..