AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 Chinna Katha Kaadu: ఓటీటీలోకి నివేదా థామస్ మూవీ.. ’35 చిన్న కథ కాదు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హీరో దగ్గుబాటి ప్రజెంటర్ గా వ్యవహరించాడు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ దాదాపు ఐదున్నర కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు నుంచే పాజిటవ్ రివ్యూస్ వచ్చాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

35 Chinna Katha Kaadu: ఓటీటీలోకి నివేదా థామస్ మూవీ.. '35 చిన్న కథ కాదు' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Nivetha Thomas
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2024 | 8:05 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేదా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నివేదా.. ఇప్పుడు కాస్త బరువు పెరిగింది. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’35 చిన్న కథ కాదు’ . ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హీరో దగ్గుబాటి ప్రజెంటర్ గా వ్యవహరించాడు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ దాదాపు ఐదున్నర కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు నుంచే పాజిటవ్ రివ్యూస్ వచ్చాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 35 చిన్న కథ కాదు సినిమాలో నవ్విస్తూనే అంతర్లీనంగా విద్యావ్యవస్థకు సంబంధించిన ఓ సందేశాన్ని టచ్ చేశారు డైరెక్టర్ నందకిషోర్. ఈ సినిమాలో కొడుకు చదువు కోసం ఆరాటపడే తల్లిగా నివేదా థామస్ నటనకు ప్రశంసలు అందుకుంది. పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ ఈ సూపర్ హిట్ గా నిలిచి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.

35 చిన్న కథ కాదు..

ఇవి కూడా చదవండి

ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) దంపతుల కొడుకు అరుణ్ మ్యాథ్స్ సబ్జెక్టులో వెనకబడిపోతాడు. స్కూల్లో లెక్కలకు సంబంధించి తిక్క ప్రశ్నలతో టీచర్లను విసిగిస్తుంటాడు. దీంతో అతడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అతడిని ఆరో తరగతిలోనే ఫెయిల్ చేస్తాడు టీచర్ చాణక్య (ప్రియదర్శి). అరుణ్ స్కూల్లో ఉండాలంటే మ్యాథ్స్ లో 35 మార్కులు రావాలని టీచర్స్ కండీషన్ పెట్టడంతో కొడుకుకు మ్యాథ్స్ నేర్పించడానికి సరస్వతి ఏం చేసింది.. ? చివరకు అరుణ్ 35 మార్కులు తెచ్చుకున్నాడ ? అనేది సినిమా. ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.