35 Chinna Katha Kaadu OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న నివేదా థామస్ సినిమా.. పిల్లలు, పేరెంట్స్ అసలు మిస్ అవ్వద్దు

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. చదువు విషయంలో పిల్లలకు తల్లి దండ్రుల సపోర్టు ఎంత ముఖ్యమనే యూనివర్సల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ నంద కిశోర్. ఇక ఈ సినిమా కథ నచ్చడంతో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా 35 చిన్న కథ కాదు మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

35 Chinna Katha Kaadu OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న నివేదా థామస్ సినిమా.. పిల్లలు, పేరెంట్స్ అసలు మిస్ అవ్వద్దు
35 Cinna Katha Kaadu Movie
Follow us

|

Updated on: Oct 06, 2024 | 2:31 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. చదువు విషయంలో పిల్లలకు తల్లి దండ్రుల సపోర్టు ఎంత ముఖ్యమనే యూనివర్సల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ నంద కిశోర్. ఇక ఈ సినిమా కథ నచ్చడంతో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా 35 చిన్న కథ కాదు మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. నివేదా థామస్ తో పాటు విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్, గౌతమి, అభయ్ శంకర్, భాగ్యరాజ్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్లు, పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడం, ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేయడంతో రిలీజ్ కు ముందే 35 చిన్న కథ కాదు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 6 న థియేటర్లలో విడుదలైన ఈ ఫీల్ గుడ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులతో పాటు పలువురి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పిల్లలు, పేరెంట్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా 35 చిన్న కథ కాదు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 02 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో నివేదా థామస్ ఫీల్ గుడ్ మూవీకి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తుందని ఆహా తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా 70 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసిందని అధికారికంగా ప్రకటించింది.

రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 35- ఒక చిన్న కథ కాదు నిర్మించారు. వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మూవీ మొత్తం తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. మ్యాథ్స్ లో వెనుకపడిన విద్యార్థిని టీచర్ జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్‍లో కంటిన్యూ కావాలంటే గణితంలో కనీసం 35 మార్కులు తెచ్చుకోవాలని కండీషన్ పెడతాడు. దీంతో కొడుకు కోసం తల్లి (నివేదా థామస్) మ్యాథ్స్ నేర్చుకుంటుంది. ఆ తర్వాత కొడుక్కి కూడా నేర్పిస్తుంది. మరి టీచర్ చెప్పినట్లు పిల్లాడు మ్యాథ్స్ లో పాస్ మార్కులు తెచ్చుకున్నాడా? అనేది ఈ మూవీ మెయిన్ పాయింట్. పిల్లల చదువు గురించి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దారు. కచ్చితంగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కలిసి చూడాల్సిన సినిమా ఇది అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఆహలోనూ సూపర్ రెస్పాన్స్..

35..  చిన్న కథ కాదు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నివేదా సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్.. పేరెంట్స్ డోంట్ మిస్
నివేదా సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్.. పేరెంట్స్ డోంట్ మిస్
కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఏమవుతుందో తెలుసా.?
కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఏమవుతుందో తెలుసా.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
10th విద్యార్ధులకు అలర్ట్.. ఇక సైన్స్ పరీక్షలు వేర్వేరుగా 2రోజులు
10th విద్యార్ధులకు అలర్ట్.. ఇక సైన్స్ పరీక్షలు వేర్వేరుగా 2రోజులు
తిరుమల నడక మార్గంలో కలకలం..
తిరుమల నడక మార్గంలో కలకలం..
ఆర్టీసీ బస్సులో ప్రయాణం..మహిళ సమాధానానికి పగలపడి నవ్విన ఎమ్మెల్యే
ఆర్టీసీ బస్సులో ప్రయాణం..మహిళ సమాధానానికి పగలపడి నవ్విన ఎమ్మెల్యే
ఏలకులా మజాకా..! డైలీ రెండు తింటే ఏమవుతుందో తెలుసా..
ఏలకులా మజాకా..! డైలీ రెండు తింటే ఏమవుతుందో తెలుసా..
వర్క్ వేరు.. ఫ్యామిలీ వేరు.. రెండింటి బ్యాలెన్స్ పై అలియా కామెంట్
వర్క్ వేరు.. ఫ్యామిలీ వేరు.. రెండింటి బ్యాలెన్స్ పై అలియా కామెంట్
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారుబ్రేక్ ఫెయిల్‌ అయ్యిందా? ఇలా చేయండి
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారుబ్రేక్ ఫెయిల్‌ అయ్యిందా? ఇలా చేయండి
టెట్ ఆన్సర్ 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే
టెట్ ఆన్సర్ 'కీ', రెస్పాన్స్ షీట్లు విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..