OTT Movie: కవలలను టార్గెట్ చేసి చంపే సైకో కిల్లర్.. ఓటీటీలో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.9 రేటింగ్
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ జానర్ సినిమాలకు బాగా ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టే ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం ఆసక్తికరమైన సినిమాలను తమ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కు తీసుకొస్తుంటాయి.

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ వారం ఓటీటీల విషయానికి వస్తే.. సమంత శుభం, మలయాళం సినిమా జింఖానా, అలాగే రానా నాయుడు లాంటి ఆసక్తికర సినిమాలు,వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చేసింది. ఒక పట్టణంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్ వేశారు అనేది ఈ మూవీలో చక్కగా చూపారు. ఇక ఐఎమ్‌డీబీ కూడా ఈ సినిమాకు 7.9 రేటింగ్ ఇవ్వడం విశేషం. సినిమా కథ విషయానికి వస్తే.. వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ డీల్ చేస్తాడు. అయితే విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన హీరో చేతికి ఈ కేసు వస్తుంది. ఈ హత్యల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని హీరో తెలుసుకుంటాడర. మరి ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారా? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ పేరు లెవెన్. నవీన్ చంద్ర హీరోగా నటించాడు. రియా హరి, శశాంక్, అభిరామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. లోకేశ్ అజిల్స్ దర్శకత్వం వహించారు. ఏఆర్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. మే 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో13 నుంచి లెవెన్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి లెవన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరో నాలుగు రోజుల్లో ఆహాలో స్ట్రీమింగ్..
Critically acclaimed movie 🔥#Eleven (Tamil) streaming from June 13th on @Tentkotta, @ahatamil & @PrimeVideoIN 🍿!!#OTT_Trackers pic.twitter.com/Gw9ONsE9B3
— OTT Trackers (@OTT_Trackers) June 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.