Unstoppable With NBK 2: స్విమ్మింగ్‌పూల్ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేశ్.. అన్‌స్టాపబుల్ షోలో ఏం చెప్పారంటే?
మొదటి ఎపిసోడ్‌కు బాలకృష్ణ వియ్యంకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారడు నారా లోకేశ్‌ను అతిథులుగా ఆహ్వానించారు. ఇక ట్రైలర్‌లోనే 1995 బిగ్ డెసిషన్, వైఎస్సార్‌తో అనుబంధం, అలాగే లోకేశ్ స్విమ్మింగ్‌పూల్ ఫొటోలపై ప్రశ్నలు అడిగి షోపై ఆసక్తిని రెట్టింపు చేశారు బాలయ్య.
నందమూరి బాలయ్య అభిమానులతో పాటు ఓటీటీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత సీజన్ కంటే ఈసారి మరింత మెరుగ్గా షోను ప్లాన్ చేసినట్లు టీజర్, ట్రైలర్ల ద్వారానే అర్థమైంది. అందుకు తగ్గట్లే మొదటి ఎపిసోడ్‌కు బాలకృష్ణ వియ్యంకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారడు నారా లోకేశ్‌ను అతిథులుగా ఆహ్వానించారు. ఇక ట్రైలర్‌లోనే 1995 బిగ్ డెసిషన్, వైఎస్సార్‌తో అనుబంధం, అలాగే లోకేశ్ స్విమ్మింగ్‌పూల్ ఫొటోలపై ప్రశ్నలు అడిగి షోపై ఆసక్తిని రెట్టింపు చేశారు బాలయ్య. వీటికి చంద్రబాబు, లోకేశ్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే సమాధానాలిచ్చారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం కాదు. ముఖ్యంగా లోకేశ్ స్విమ్మింగ్ ఫూల్ ఫొటోల వ్యవహారం. గతంలో లోకేశ్‌కు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ బయటకు వచ్చాయి. స్విమ్మింగ్ పూల్‌లో విదేశీ అమ్మాయిలతో జలకాలు ఆడుతూ, బీచ్ లో తిరుగుతూ కొన్ని ఫొటోలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.
అందులో ఉన్నది నేనే.. అయితే..
అప్పటి ప్రతిపక్ష సభ్యులు కూడా వీటిని విపరీతంగా ట్రోల్ చేస్తూ లోకేశ్, చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శల వర్షం గుప్పించారు. ఇప్పుడివే ఫొటోలను చూపిస్తూ అన్‌స్టాపబుల్ వేదికగా బాలయ్య మరోసారి లోకేష్, చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఫొటోలు అసెంబ్లీ వరకు వెళ్లాయని, ఆ ఫొటోల వెనకున్న విషయమేంటని తండ్రీ కొడుకులను అదిగారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ‘మామకు లేని సందేహం నాకెందుకు’ అని చెప్పుకొచ్చారు. తాజాగా ఫుల్ ఎపిసోడ్‌లో ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చారు లోకేశ్. ‘ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. అయినా అందులో తప్పేముంది. 2006లో కాలేజ్ డేస్‌లో సరదాగా దిగిన ఫొటోలవి. వారంతా నాతో పాటు నా సతీమణి బ్రాహ్మణికి కామన్ ఫ్రెండ్స్. నా కంటే బ్రాహ్మణికే వారు ఎక్కువగా తెలుసు. ఆ ఫొటోల్లో తప్పేముందో నాకైతే తెలియడం లేదు. కావాలంటే ఆ ఫొటోలు ఫ్రేమ్ కట్టిస్తా’ అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు లోకేశ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ విషయంపై లోకేశ్ స్పందన అడగ్గా.. ‘ఎక్కడైతే నేను ఓడిపోయానో..తిరిగి అక్కడే గెలవాలని ప్రయత్నిస్తున్నాను. మూడేళ్ల నుంచి నేను మంగళగిరిలో నే తిరుగుతున్నాను’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..