Minister Roja: ‘అన్‌స్టాపబుల్’ గా బావ, బామ్మర్దులు అబద్ధాలాడారు.. మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
ఈ టాక్‌షోలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా 1995లో జరిగిన రాజకీయ పరిణామాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత. అదేవిధంగా 1995లో తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదంటూ బాలయ్య కూడా బాబుకు వంత పాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సెకెండ్ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు బాలయ్య వియ్యంకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం నుంచే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ టాక్‌షోలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా 1995లో జరిగిన రాజకీయ పరిణామాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత. అదేవిధంగా 1995లో తీసుకున్న నిర్ణయం తప్పేమీ కాదంటూ బాలయ్య కూడా బాబుకు వంత పాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నటి రోజా అన్‌స్టాపబుల్ షోపై స్పందించారు. నేను అన్‌స్టాపబుల్ షో చూశాను. బావ బామ్మర్దులు కళ్లార్పకుండా అన్‌స్టాపబుల్‌గా అబద్దాలు చెప్పారు. ఆరోజు అధికార దాహంతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, పదవిని లాక్కున్నారు చంద్రబాబు’
ప్రజలు నవ్వుకుంటున్నారు..
‘కానీ ఈరోజు అమాయకపు మాటలు మాట్లాడుతున్నారు. ఆరోజు మీరు కూడా మాతో ఉన్నారు. నేను కాళ్లు పట్టుకున్నాను. ఏడ్చాను. అయినా ఎన్టీఆర్ వినలేదంటూ చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌షో ద్వారా అందరినీ మభ్య పెట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వీళ్ల మాటలను చూసి అందరూ నవ్వుకుంటున్నారు’ అని రోజా ధ్వజమెత్తారు.
కాగా అన్‌స్టాపబుల్ వేదికగా1995 పరిణామాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పార్టీలో కొన్ని సమస్యల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తనతో పాటు బీవీ మోహనరెడ్డి, బాలకృష్ణ , రామకృష్ణ తో కలిసి ఆరోజు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లానని, ఆయన్ని బతిమాలానని, కాళ్లు పట్టుకున్నానని చెప్పుకొచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ మీద బయటి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంఫ్లూయెన్స్ పెరిగిపోయిందని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక ఈ విషయం పై బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఒక నందమూరి కుటుంబ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చెబుతున్నాను.. ఆరోజు మీరు తీసుకున్న నిర్ణయం తప్పుకాదు. 1999 ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని నిరూపించాయి’ అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ఇప్పుడి ఈ వ్యాఖ్యలే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..