aha : కంటెంట్‌ను పైరసీ చేస్తే ఊరుకునేది లేదు.. ‘ఆహా’ సీరియస్ వార్నింగ్

అలాగే ఆకట్టుకునే గేమ్ షోస్ తో పాటు అలరించే టాక్ షోలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహిస్తోంది ఆహా

aha : కంటెంట్‌ను పైరసీ చేస్తే ఊరుకునేది లేదు.. 'ఆహా' సీరియస్ వార్నింగ్
Aha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 14, 2022 | 5:07 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా 100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది. అలాగే ఆకట్టుకునే గేమ్ షోస్ తో పాటు అలరించే టాక్ షోలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహిస్తోంది ఆహా. ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ఇండియాలో ఉన్న అన్ని టాక్ షోలకంటే అన్ స్టాపబులే నెంబర్ వన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సీజన్ 2 తో సందడి చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2  మొదటి ఎపిసోడ్ నేడు (అక్టోబర్ 14)న మొదలైంది. ఈ ఎపిసోడ్ కు తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే తమ కంటెంట్ ను పైరసీ చేస్తున్నారంటూ ఆహా వారు ఆరోపణలు చేస్తున్నారు. తమ కంటెంట్ ను పైరసీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇస్తున్నారు ఆహా టీమ్. ” ఆహా లో ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ప్రజలందరికి అత్యున్నతమైన ‘వినోదాన్ని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో అందిచేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. అందులో భాగంగా మీకు అందిస్తున్న ప్రోగ్రాం “అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె”.

ఈ కార్యక్రమం ఎంతటి వినోదాన్ని పంచుతుందో ఎలాంటి దిగ్గజాలను మీ ముందు అవిష్కరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆహా లో పనిచేసే ప్రతిఒక్కరి అలుపెరుగని కృషి, కష్ట ఫలం. దయచేసి ఈ అద్భుతమైన ప్రోగ్రాంని, ఆహా వినోదాలని 100% నాణ్యతతో ఆహా సబ్స్క్రిప్షన్ ద్వారానే ఆస్వాదించండి. పైరసీ ని ప్రోత్సహించకండి. పైరసీ చట్టరీత్యా నేరం, శిక్షార్హం. మా అభ్యర్థనని మన్నిస్తారని ఆశిస్తూ…మీ ఆహా.. అంటూ ఒక నోట్ ను రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి
Aha

Aha