Chandrababu Naidu: “ఆ రోజు నేను ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాను”.. 1995లో ఏం జరిగిందో చెప్పిన చంద్రబాబు

ఇండియాలో ఉన్న టాక్ షోలన్నింటికంటే నెంబర్ వన్ గా నిలిచింది అన్ స్టాపబుల్. ఇక సీజన్ 2 తాజాగా మొదలైంది. రెట్టింపు ఉత్సహంతో రానున్న అన్ స్టాపబుల్ 2 షోకు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు హాజరయ్యారు.

Chandrababu Naidu: ఆ రోజు నేను ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాను..  1995లో ఏం జరిగిందో చెప్పిన చంద్రబాబు
Chandrababu, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 14, 2022 | 3:34 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో ఇప్పటికే సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండియాలో ఉన్న టాక్ షోలన్నింటికంటే నెంబర్ వన్ గా నిలిచింది అన్ స్టాపబుల్. ఇక సీజన్ 2 తాజాగా మొదలైంది. రెట్టింపు ఉత్సహంతో రానున్న అన్ స్టాపబుల్ 2 షోకు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు హాజరయ్యారు.ఇప్పటికే విడుదలైన ఈ షోకు సంబంధించిన ప్రోమోలో చంద్రబాబు ను 1995 లో జరిగిన విషయం  గురించి అడిగారు. అయితే ప్రోమోలో అంత క్లియర్ గా వివరించక పోయిన.. ఈ రోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో చంద్రబాబు 1995లో జరిగిన విషయం పై స్పందించారు. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ..

నా హయాంలో నేను నాయకుల్ని గౌరవించి వారి పేర్లు అనేక సంస్థలకి పెట్టాను అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు తీసేయడం తెలుగువారిని అవమానించడం. కడప జిల్లాకి వైయెస్సార్ పేరు మార్చలేదు. ఏడాదిన్నర తర్వాత మా ప్రభుత్వం మళ్లీ వచ్చాక హెల్త్ వర్సిటీకి తిరిగి పేరు పెడతాను అన్నారు చంద్రబాబు. 1995 పార్టీలో కొన్ని సమస్యల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. బీవీ మోహనరెడ్డి, బాలక్రిష్ణ , రామక్రిష్ణ తో కలిసి ఆరోజు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాను. ఆయన్ని బతిమాలాను, కాళ్లు పట్టుకున్నాను.. ఒక మీటింగ్ పెట్టి డిస్కస్ చేయమన్నాను అని అన్నారు.

ఎన్టీఆర్ తో ముందుకు పొవాలనే మొదట అనుకున్నాము. కానీ అందుకు విరుద్దమైన నిర్ణయం తీసుకున్నాము. ఆరోజు మొత్తం ఐదుగురం కలిసి నిర్ణయం తీసుకున్నాము. అప్పుడు ఎన్టీఆర్ మీద బయటి నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంఫ్లూయెన్స్ పెరిగిపోయిందని అన్నారు చంద్రబాబు. ఇక ఈ విషయం పై బాలకృష్ణ మాట్లాడుతూ.. 1995 లో తీసుకున్న నిర్ణయం ఏమీ తప్పు కాదు. నందమూరి కుటుంబం, నారా కుటుంబం కలిసి తీసుకున్న నిర్ణయంలో ఏ తప్పు లేదు అని అన్నారు బాలకృష్ణ. ఒక నందమూరి కుటుంబ సభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా చెబుతున్నాను..ఆరోజు మీరు తీసుకున్న నిర్ణయం తప్పుకాదు అన్నారు బాలకృష్ణ. అలాగే ఆరోజు తీసుకున్న నిర్ణయం తప్పుకాదని 1999 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఆ నిర్ణయం.. అందరం కలిసి తీసుకున్న నిర్ణయం.. ఆరోజు ఎన్టీయార్ తో మాట్లాడటానికి వెళ్లిన ఐదుగురిలో నేను ఉన్నాను అని బాలకృష్ణ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.