ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్నీ మంచి శకునములే’.. ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
అలా మొదలైంది, జబర్దస్త్, కల్యాణ్ వైభోగమే, ఓ బేబీ వంటి సినిమాలతో తెలుగు సినిమాలో తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె సినిమాలన్నీ ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తారామె.

అలా మొదలైంది, జబర్దస్త్, కల్యాణ్ వైభోగమే, ఓ బేబీ వంటి సినిమాలతో తెలుగు సినిమాలో తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె సినిమాలన్నీ ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తారామె. అందుకే నందినీ రెడ్డి సినిమాలపై ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి. అలా ఈ ట్యాలెంటెడ్ లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన మరో చిత్రం అన్నీ మంచి శకునములే. యంగ్ హీరో, హీరోయిన్లు సంతోశ్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించారు. మే 18న థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ యావరేజ్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన అన్నీ మంచి శకునమేలే సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈక్రమంలో శనివారం (జూన్ 17) అర్ధరాత్రి నుంచి అన్నీమంచి శకునములే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. . తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. స్వప్న సినిమాస్, మిత్రవింద మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నరేశ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిశోర్ ,ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు.




The heartwarming journey of Rishi, Arya and their families ?
Watch #AnniManchiSakunamule on @PrimeVideoIN ? https://t.co/YvuArhJfHf@santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @SonyMusicSouth pic.twitter.com/BVslDa0Dgh
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.