Varudu Kaavalenu: ఓటీటీలో నాగశౌర్య ‘వరుడు కావలెను’.. నేటి నుంచే జీ5లో స్ట్రీమింగ్..!
నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తెలుగు సినిమా 'వరుడు కావలెను' జనవరి 7, 2022 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జీ5 ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధమైంది.
Varudu Kaavalenu Streaming In ZEE5: నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తెలుగు సినిమా ‘వరుడు కావలెను’ జనవరి 7, 2022 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జీ5 ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధమైంది. నటి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఈ సంవత్సరం అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలైంది. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు యువతీ, యువకుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతమైంది. ప్రస్తుతం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.
ఈమేరకు జీ5 ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. 2022లో జీ5 అందిస్తోన్న తొలి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటటైనర్ వరుడు కావలెను స్ట్రీమింగ్ అవుతోంది అంటూ రాసుకొచ్చింది.
నటి రీతూ వర్మ ఎల్లప్పుడూ మంచిని కోరుకునే భూమి పాత్రను ఈ సినిమాలో పోషించింది. తన జీవితంలో ఉన్న అసంతృప్తితో పెళ్లిల్లను వాయిదా వేస్తుంటుంది. హైదరాబాద్‌లో పర్యావరణ అనుకూలమైన స్టార్టప్ వ్యాపారాన్ని నడిపే పాత్రలో ఆకట్టుకుంది. భూమిని గాఢంగా ప్రేమిస్తూ, ఆమెను ఆకట్టుకోవడానికి శాంతంగా ఉండే ఆకాష్ పాత్రలో నాగ శౌర్య నటించాడు.
నాగ శౌర్య, రీతూ వర్మతో పాటు, ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, కిరీటి దామరాజు, హిమజ, హర్ష వర్ధన్, కళ్యాణి నటరాజన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి – కోల కళ్లే ఇలా, దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలిచిపోకే, వద్దానం, ఏమి చేయాలి, చెంగున చెంగునా పాటలు చాలా కాలం పాటు చార్ట్‌బస్టర్స్‌లో టాప్‌గా నిలిచాయి. ఈ సినిమా సంగీత హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
2022 lo #ZEE5 andistunna first blockbuster family entertainer #VaruduKaavalenu streaming now!https://t.co/7BjrFpQTzM#VaruduKaavalenuOnZEE5 #WatchNow @IamNagashaurya @riturv @vennelakishore @MusicThaman @SitharaEnts @Composer_Vishal @its_Himaja @harika_alekhya #LakshmiSowjanya pic.twitter.com/9b7R7d6NdY
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2022
Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా.. డబుల్ మాస్క్ ధరించాలంటూ..