AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా.. డబుల్ మాస్క్ ధరించాలంటూ..

Swara Bhasker Tests Positive For COVID-19: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం రోజువారి కరోనా కేసుల సంఖ్య

Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా.. డబుల్ మాస్క్ ధరించాలంటూ..
Swara Bhasker
Shaik Madar Saheb
|

Updated on: Jan 07, 2022 | 11:01 AM

Share

Swara Bhasker Tests Positive For COVID-19: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం రోజువారి కరోనా కేసుల సంఖ్య లక్షమార్క్ దాటింది. కోవిడ్ థర్డ్‌వేవ్‌లో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే జాన్ అబ్రహం, నిర్మాత ఏక్తా కపూర్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, అన్షుల్ కపూర్, టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు, మంచులక్ష్మీ వంటి వారు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో మరో నటికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కి కోవిడ్ సోకింది. ఈ మేరకు నటి స్వర భాస్కర్ గురువారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలంటూ ఆమె కోరింది. ఈ సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.

‘‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. నాకు జనవరి5న లక్షణాలు కనిపించగా.. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. నేను, నా కుటుంబం జనవరి 5 సాయంత్రం నుంచి ఇప్పటి వరకూ ఎవరిని కలవలేదు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’.. అంటూ పేర్కొంది. గత వారంలో తనను కలిసిన ప్రతిఒక్కరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. డబుల్ మాస్క్ ధరించి సురక్షితంగా ఉండండి అంటూ అందరికీ సూచించింది. రెండుసార్లు టీకాలు తీసుకున్నానని.. త్వరలో నెగిటివ్ ఫలితం వస్తుందని ఆశిస్తున్నానంటూ స్వర భాస్కర్ పేర్కొంది.

View this post on Instagram

A post shared by Swara Bhasker (@reallyswara)

కాగా.. స్వర భాస్కర్.. సల్మాన్ ఖాన్ సరసన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, కంగనా రనౌత్ ప్రధానపాత్ర పోషించిన ‘తను వెడ్స్ మను’ సినిమాతో పాపులారిటీ సాధించింది.

Also Read:

India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. లక్ష మార్క్ దాటేసిన కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఎన్నంటే?

Pakistan First Woman SC Judge: పాకిస్తాన్‌ చరిత్రలో సంచలనం.. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌..