Acharya: ప్రముఖ ఓటీటీలో మెగాస్టార్ ‘ఆచార్య’.. స్టీమింగ్ ఎప్పటి నుంచి అంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)నటించిన ఆచార్య(Acharya) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో వీకెండ్ లోనే ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. కొరటాల ఇలా చేశాడేంటి అని అభిమానులు, ప్రేక్షకులు అనుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ ను ఆచార్య నిరాశపరచడంతో సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. అయితే ఓవైపు థియేటర్లలో ఆచార్య సందడి చేస్తుండగా.. మరోవైపు ఆచార్య ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతుంది.
ఆచార్య సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రముఖ ఓటీటీలో ఆచార్య సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్టుగా తెలుస్తుంది. భారీ ధరకు అమెజాన్ ఆచార్య సినిమా ను దక్కించుకుందని అంటున్నారు. ఇక ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఆచార్య సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. చిరంజీవి – చరణ్ లపైనే పూర్తి దృష్టి పెట్టడంతో మిగిలిన వారి పాత్రలను సరిగ్గా వాడుకోలేకపోయారు కొరటాల. దాంతో ఆచార్య సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.