AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chathurmukham: ఆహాలో టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీ.. ‘చతుర్‏ముఖం’ తో రానున్న మంజు వారియర్..

ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం సరికొత్త వినోదాన్ని పరిచయం చేయడంలో ఆహా మరో ముందడుగు వేసింది. వరుస బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ వెబ్ సిరీస్‏లను

Chathurmukham: ఆహాలో టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీ.. 'చతుర్‏ముఖం' తో రానున్న మంజు వారియర్..
Chathurmukham
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2021 | 9:21 AM

Share

ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం సరికొత్త వినోదాన్ని పరిచయం చేయడంలో ఆహా మరో ముందడుగు వేసింది. వరుస బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ వెబ్ సిరీస్‏లను విడుదల చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తొలి ఓటీటీ ప్లాట్‏ఫామ్ ఆహా. సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‏లతో ప్రేక్షకులను అనుక్షణం థ్రిల్లింగ్ ఉత్సాహాన్ని కలిగిస్తూ.. ఇతర ఓటీటీ ప్లాట్‏ఫామ్స్‏లకు గట్టి పోటీనిస్తూ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. తాజాగా సరికొత్తగా టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీ ‘చతుర్‏ముఖం’ ఆగస్ట్ 13న ఆహాలో విడుదల కానుంది. ఇందులో మంజు వారియర్, సన్నీ వేనె, శ్రీకాంత్ మురళి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి రంజీత్ కామల శంకర్ దర్శకత్వం వహించారు.

గతేడాది ఏప్రిల్ నెలలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. మ‌ల‌యాళ మాతృక‌ ‘చతుర్ ముఖం’ బుసాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్, చుంచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, మేలిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌ ఇలా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్రదర్శితమైంది. ఈ సినిమా నిర్మాణంలో మంజు వారియర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు పోస్టర్‏ను గురువారం విడుదల చేసింది చిత్రయూనిట్.

ప్రస్తుత కాలానికి చెందిన తేజస్విని అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ జీవితం చుట్టూ తిరిగే కథే ఈ ‘చతుర్‏ముఖం’. తన స్నేహితుడితో కలిసి సీసీటీవీ సొల్యూషన్స్ వ్యాపారం చేస్తుంది. అయితే ఫోన్ వాడకానికి ఎక్కువగా అలవాటు పడడంతో.. తన మొబైల్ పాడైన సమయంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొంటుంది. ఇక ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి జీవితంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీంతో వాటి నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది ? ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకుంది ? అనేదే ఈ సినిమా స్టోరీ. మలయాళంలో సూపర్ హిట్‏గా నిలిచిన ఈ స్టోరీ ఇప్పుడు తెలుగులో ఆహాలో ప్రేక్షకులను అలరించనుంది.

Also Read: Cheran: సినిమా సెట్‏లో పెను ప్రమాదం.. తలకు బలమైన గాయం.. అయినా షూటింగ్ ఆపని నటుడు..

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!

Kiara Advani: చరణ్‏తో జోడి కట్టేందుకు భారీగా డిమాండ్ చేస్తున్న కియారా ?.. ఎంత అడిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..