AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: చరణ్‏తో జోడి కట్టేందుకు భారీగా డిమాండ్ చేస్తున్న కియారా ?.. ఎంత అడిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోలకు ధీటుగా హీరోయిన్స్ కూడా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకు కూడా హీరోతో సమానంగా

Kiara Advani: చరణ్‏తో జోడి కట్టేందుకు భారీగా డిమాండ్ చేస్తున్న కియారా ?.. ఎంత అడిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Kiara Advani
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2021 | 8:14 AM

Share

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోలకు ధీటుగా హీరోయిన్స్ కూడా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకు కూడా హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని అందాల తారలు కూడా నిర్మాతలను కోరుతున్నారు. ఇక పాన్ ఇండియా చిత్రాలలో, భారీ బడ్జెట్ సినిమాలలో నటించే ఛాన్స్ వస్తే మాత్రం రెమ్యూనరెషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు ఇప్పటి హీరోయిన్స్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతుంది. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా… సలార్, రాధేశ్యామ్, పుష్ప వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్- శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా లెవల్‏లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జె్ట్‏ తో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటించబోతున్నట్లుగా ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే ఈ సినిమా కోసం కియారా భారీగానే డిమాండ్ చేసిందట. చెర్రీతో జత కట్టేందుకు ఈ అమ్మడు ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం అడిగినట్లుగా సమాచారం. దివంగత నటుడు సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోని సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కియారా.. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్స్ స్థానంలో నిలిచింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కోసం కియారా అప్పట్లోనే రూ. 75 లక్షల వరకు పారితోషికం తీసుకుందట. అలాగే రామ్ చరణ్ సరసన ఇప్పటికే వినయ విదేయ రామ సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి చెర్రీతో స్ర్కీన్ షేర్ చేసుకోబోతుంది కియారా. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్-శంకర్ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: Raghava Prasad: టాలీవుడ్‏లో విషాదం.. సినీ నిర్మాత, నిర్మాత బొమ్మిరెడ్డి మృతి.. పలువురి సంతాపం..

Jr.NTR: ఎన్టీఆర్ ఐడీ కార్డు మీరెప్పుడైనా చుశారా ? వేసుకోవడం ఇదే మొదటి సారి అంటున్న యంగ్ టైగర్.. ఫోటోస్ వైరల్..

Shocking: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక మహిళ మృతి.. గ్రామం మొత్తం అందకారం.. అసలేం జరిగిందంటే?