Shocking: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక మహిళ మృతి.. గ్రామం మొత్తం అందకారం.. అసలేం జరిగిందంటే?

అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. అంతేకాదు ఆ గ్రామం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Shocking: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక మహిళ మృతి.. గ్రామం మొత్తం అందకారం.. అసలేం జరిగిందంటే?
Electrocuted Death
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 06, 2021 | 7:04 AM

Woman Electrocuted to Death: అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. అంతేకాదు ఆ గ్రామం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం మంగళమడక గ్రామంలో విద్యుత్ హైవోల్టేజ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా గ్రామంలో హైవోల్టేజ్ సరఫరా అయ్యింది. దీంతో గ్రామంలో చాలా ఇళ్లల్లో విద్యుత్ పరికరాలు టీవీ, ఫ్రిడ్జ్, మోటార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్దపెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి.

ఇదే క్రమంలో గ్రామానికి చెందిన ఓ మహిళ విద్యుత్ లైట్ స్విచ్చాన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం స్పందించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఊరు మొత్తం అంధకారంగా మారిపోయింది. హఠాత్తు పరిణామంలో గ్రామంలో ఎం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also… Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..